యాప్నగరం

జడేజా మ్యాజిక్ వృథా.. తమిళనాడును వరించిన విజయం

Ranji Trophy Highlights: రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర అనూహ్య రీతిలో ఓటమి పాలైంది. సుదీర్ఘ కాలం తర్వాత మైదానంలోకి దిగిన రవీంద్ర జడేజా 7 వికెట్లు తీసి సత్తా చాటినా.. తన జట్టుకు విజయం అందించలేకపోయాడు. తమిళనాడు 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ హార్విక్ దేశాయ్ (101), అర్పిత్ వాసవద (45) జట్టును ఆదుకున్నారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 27 Jan 2023, 8:14 pm
గాయం నుంచి కోలుకున్న భారత క్రికెటర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కమ్ బ్యాక్ మ్యాచ్‌లో 7 వికెట్లతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. రంజీ ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన జడేజా.. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ మాత్రమే తీసినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో 53 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. దీంతో తమిళనాడు 133 పరుగులకే ఆలౌటయ్యింది. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 206 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో తమిళనాడు 59 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Samayam Telugu Ravindra Jadeja
రవీంద్ర జడేజా


266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ హార్విక్ దేశాయ్ (205 బంతుల్లో 101), అర్పిత్ వాసవద (88 బంతుల్లో 45) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 89 పరుగులు జోడించారు. దీంతో సౌరాష్ట్ర కోలుకుంది.

హాఫ్ సెంచరీ ముంగిట అర్పిత్ ఔట్ కావడంతో అతడి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రవీంద్ర జడేజా.. హార్విక్‌తో కలిసి ఆరో వికెట్‌కు 51 పరుగులు జోడించాడు. 36 బంతుల్లో 25 పరుగులు చేసిన జడేజా కుదురుకుంటున్న దశలో అజిత్ రామ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. సెంచరీ చేసిన హరీశ్ దేశాయ్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో సౌరాష్ట్ర 60 పరుగుల తేడాతో ఓడింది.

బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి సన్నాహాకంగా రంజీ క్రికెట్ ఆడుతున్న జడేజా.. తమిళనాడుపై బౌలింగ్‌లో రాణించాడు. కానీ, బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. జడ్డూ తొలి ఇన్నింగ్స్‌లో 23 బంతుల్లో 15 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 36 బంతుల్లో 25 పరుగులకే ఔటయ్యాడు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.