యాప్నగరం

తమిళనాడుని 176కే కుప్పకూల్చిన ఆంధ్రా

రంజీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లోనే ఆంధ్రా బౌలర్లు విజృంభించారు. చెపాక్ స్టేడియంలో శుక్రవారం ఆరంభమైన మ్యాచ్‌లో భార్గవ్ భట్

TNN 6 Oct 2017, 5:52 pm
రంజీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లోనే ఆంధ్రా బౌలర్లు విజృంభించారు. చెపాక్ స్టేడియంలో శుక్రవారం ఆరంభమైన మ్యాచ్‌లో భార్గవ్ భట్ (4/52), పృథ్వీరాజ్‌ (3/39) చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన తమిళనాడు 176 పరుగులకే కుప్పకూలిపోయింది. గాయం కారణంగా చాలా రోజుల తర్వాత మైదానంలోకి వచ్చిన మురళీ విజయ్ (4: 21 బంతుల్లో) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోగా.. ఇటీవల ఇంగ్లాండ్‌లో కౌంటీ మ్యాచ్‌లు ఆడి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (9: 17 బంతుల్లో) నిరాశపరచడంతో తమిళనాడు ఆరంభంలోనే ఒత్తిడికి గురైంది.
Samayam Telugu tamil nadu vs andhra bowled out
తమిళనాడుని 176కే కుప్పకూల్చిన ఆంధ్రా


హనుమ విహారీ సారథ్యంలో ఆంధ్రా బౌలర్లు మ్యాచ్ ఆది నుంచే ఆధిపత్య ధోరణితో బౌలింగ్ చేస్తూ వచ్చారు. తమిళనాడు జట్టులో బాబా అపరజిత్ (51: 137 బంతుల్లో 4x4) మాత్రమే అర్ధశతకంతో పరువు నిలిపే ఇన్నింగ్స్ ఆడాడు. 85 ఓవర్లలోనే ఆ జట్టు ఆలౌటవడంతో అనంతరం బ్యాటింగ్‌కి దిగిన ఆంధ్రా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 8 పరుగులతో నిలిచింది. ఓపెనర్లు ప్రశాంత్ కుమార్ (1 నాటౌట్), భరత్ (7 నాటౌట్) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్, మహారాష్ట్ర మధ్య శుక్రవారం జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా తొలి రోజు ఒక బంతి కూడా పడలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.