యాప్నగరం

భారత క్రికెటర్ ఎమోషనల్ పోస్ట్.. రీఎంట్రీ కోసం వెయిటింగ్

కరోనా వైరస్ కారణంగా ఆటకి దూరంగా ఉంటున్న క్రికెటర్లు ఎమోషనల్‌గా ఫీలవుతున్నారు. భారత్‌లో మార్చి మూడో వారం నుంచి క్రికెట్‌ మ్యాచ్‌లకి బ్రేక్‌లు పడగా.. ఇప్పట్లో సిరీస్‌లు జరిగే సూచనలు కనిపించడం లేదు.

Samayam Telugu 14 Jul 2020, 6:18 am
కరోనా వైరస్ కారణంగా మార్చి నుంచి భారత క్రికెటర్లు ఆటకి దూరంగా ఉంటున్నారు. దేశంలో వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఇప్పట్లో క్రికెట్ సిరీస్‌లు జరిగే సూచనలు కూడా కనిపించడం లేదు. దాంతో.. దాదాపు నాలుగు నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్న క్రికెటర్లు.. క్రికెట్‌ని చాలా మిస్ అవుతున్నట్లు చెప్పుకొస్తున్నారు. మైదానంలోకి రీఎంట్రీ కోసమే వారి ఎదురుచూపు.
Samayam Telugu ​KL Rahul
కేఎల్ రాహుల్


టీమిండియాలో ఈ ఏడాది ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తున్న వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్.. మూలన పడేసిన కిట్‌ బ్యాగ్‌ని ఓపెన్ చేసి అందులోని హెల్మెట్‌ని ప్రేమగా చూస్తున్న ఫొటోని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఆ పోస్ట్‌కి ‘ఐ మిస్ యు’ అని క్యాప్షన్‌ని జతచేసిన రాహుల్.. కర్ణాటకలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో గత మార్చి నుంచి క్రికెట్ ప్రాక్టీస్‌కి కూడా దూరంగా ఉంటున్నాడు.

View this post on Instagram I miss you 🙁 A post shared by KL Rahul👑 (@rahulkl) on Jul 13, 2020 at 1:11am PDT

భారత క్రికెటర్లలో ఇప్పటికే కొంత మంది నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలెట్టారు. ఉత్త‌రప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో సురేశ్ రైనా, రిషబ్ సోమవారం ప్రాక్టీస్‌ని ప్రారంభించగా.. గత వారంలో ఫాస్ట్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ కాసేపు నెట్స్‌లో శ్రమించారు. ఇక షమీ.. తన పొలంలో ఏర్పాటు చేసుకున్న పిచ్‌పై బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ముంబయిలోని రోహిత్ శర్మ ఒక్క రోజు మాత్రమే ఇంటి వెలుపలికి వచ్చి కాసేపు ప్రాక్టీస్ చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.