ఐపీఎల్లో కెప్టెన్‌గా ముంబయి ఇండియన్స్ టీమ్‌ని ఐదుసార్లు విజేతగా నిలిపిన రోహిత్ శర్మ.. నిదహాస్ ట్రోఫీలోనూ కెప్టెన్‌గా భారత్ జట్టుని విజేతగా నిలిపాడు. అలానే గత రెండేళ్లుగా మైదానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి విలువైన సలహాలు ఇస్తూ.. భారత్ జట్టు విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాడు. దాంతో.. రోహిత్ చేతికి వన్డే, టీ20 పగ్గాలివ్వాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. మరోవైపు విరాట్ కోహ్లీ ఐసీసీ టైటిల్స్‌తో పాటు ఐపీఎల్‌లోనూ కనీసం ఒక్కసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ని విజేతగా నిలపలేకపోవడం అతనిపై ఒత్తిడి పెంచింది.
Rohit Sharma Captain: రోహిత్ శర్మ చేతికి టీమిండియా పగ్గాలు..? కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై
Indian ODI T20 Cricket Team Captain: గత ఏడాదన్నరగా సెంచరీ కోసం నిరీక్షిస్తున్న విరాట్ కోహ్లీ.. బ్యాటింగ్‌పై ఫోకస్ చేసేందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నాడు. టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ చేతికి వన్డే, టీ20...
Samayam Telugu 13 Sep 2021, 10:06 am
ప్రధానాంశాలు:
- కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్న కోహ్లీ
- టీ20 వరల్డ్‌కప్ తర్వాత అధికారిక ప్రకటన
- వన్డే, టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపిక?
- 2017 నుంచి పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ