యాప్నగరం

కోహ్లి కెరీర్లో తొలిసారి.. 2020లో అది మిస్సయ్యింది!

క్రికెట్లో బోలెడన్ని రికార్డులను తిరిగరాసిన కోహ్లి.. వన్డేల్లో శతకాల మోత మోగిస్తున్నాడు. కాగా 2020లో మాత్రం వన్డేల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు.

Samayam Telugu 3 Dec 2020, 7:39 am
క్రికెట్లో బోలెడన్ని రికార్డులు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లి.. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో రూ.12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా సచిన్ రికార్డును కోహ్లి తిరగరాశాడు. పరుగుల యంత్రంగా పేరొందిన విరాట్.. వన్డేల్లో తిరుగులేని ఆటగాడిగా పేరొందాడు. కానీ మూడో వన్డేలో 63 పరుగుల వద్ద ఔటైన కోహ్లి.. హాఫ్ సెంచరీని సెంచరీగా మలవలేకపోయాడు.
Samayam Telugu Virat Kohli
Virat Kohli (Reuters Photo)


2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లి.. 2009 నుంచి ఏటా కనీసం ఒక సెంచరీ చొప్పున చేశాడు. కానీ 2020లో మాత్రం ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. 2020లో 9 వన్డేలు మాత్రమే ఆడిన విరాట్ ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేసి నిలకడగా రాణించాడు.

2019 ఆగస్టులో వెస్టిండీస్‌పై చివరిసారిగా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన కోహ్లి.. ఆ తర్వాత 12 మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఒక్క శతకం కూడా నమోదు చేయలేకపోయాడు. 2017, 2018 సంవత్సరాల్లో 6 చొప్పున శతకాలు నమోదు చేసిన విరాట్.. 2012, 2019ల్లో 5 చొప్పున సెంచరీలు చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.