యాప్నగరం

Virat Kohli: న్యూజిలాండ్‌పై ప్రతీకార ఆలోచన లేదు

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్ల తరహాలో మైదానంలో హద్దులు దాటడం, కవ్వింపులకి దిగడం లాంటి వాటికి న్యూజిలాండ్ క్రికెటర్లు సాధారణంగా దూరంగా ఉంటారు. ఇదే విషయాన్ని కోహ్లీ తాజాగా స్పష్టం చేశాడు.

Samayam Telugu 23 Jan 2020, 3:58 pm
భారత్ జట్టు శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో తలపడబోతోంది. గత ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో చివరిగా కివీస్‌తో తలపడిన టీమిండియా.. ఆ జట్టు చేతిలో 18 పరుగుల తేడాతో సెమీ ఫైనల్లో ఓడి ఇంటిబాట పట్టింది. దీంతో.. ఆ ఓటమికి భారత్ జట్టు ఈ సిరీస్‌లో బదులు తీర్చుకోనుందా..? అని తాజాగా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రశ్నించగా.. అతను హుందాగా సమాధానమిచ్చాడు.
Samayam Telugu team india captain virat kohli says you cant have revenge on mind while taking on nice new zealand
Virat Kohli: న్యూజిలాండ్‌పై ప్రతీకార ఆలోచన లేదు


Read More: కీపర్ రిషబ్ పంత్‌పై వేటు.. క్లారిటీ ఇచ్చేసిన విరాట్ కోహ్లీ
‘ఆ ఓటమికి ప్రతీకారం గురించి ఆలోచించినా.. న్యూజిలాండ్ ఆటగాళ్లని మైదానంలో చూస్తే..? ఆ ఫీలింగ్ రాదు. ఎందుకంటే..? ఆ టీమ్‌లోని క్రికెటర్లు చాలా మంచివారు. గ్రౌండ్‌లోనూ చాలా హుందాగా వ్యవహరిస్తుంటారు. మైదానంలో హద్దులు మీరి వారు ఎప్పుడూ ప్రవర్తించరు. కాబట్టి.. దీన్ని ఓ ప్రతీకార పోరుగా చూడొద్దండి. ఇది కేవలం రెండు అత్యుత్తమ జట్ల మధ్య జరుగుతున్న సిరీస్ మాత్రమే. న్యూజిలాండ్‌ని దాని సొంతగడ్డపై ఓడించడం భారత్‌కి సవాలే’ అని కోహ్లీ వెల్లడించాడు.

Read More: టీ20ల్లో ధోనీ రికార్డ్‌కి అడుగు దూరంలో కోహ్లీ.. నెం.1 కెప్టెన్‌గా నిలిచే ఛాన్స్
కివీస్‌తో శుక్రవారం నుంచి ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ని టీమిండియా ఆడనుంది. ఈ మేరకు ఇప్పటికే టీ20, వన్డే జట్టుని భారత సెలక్టర్లు ప్రకటించగా.. ఇంకా టెస్టులకి జట్టుని ప్రకటించలేదు.

భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్

Read More: సెహ్వాగ్ బట్టతలపై సెటైర్ పేల్చిన షోయబ్ అక్తర్

భారత వన్డే జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ట్ కెప్టెన్), పృథ్వీ షా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్, కేదార్ జాదవ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.