యాప్నగరం

కసి మీదున్న పంత్, చాహల్ .. బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ.. (వీడియో)

భారత వికెట్‌కీపర్ పంత్ సోషల్ మీడియాలో పెట్టిన రెండు వీడియోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. లంకతో తొలి టీ20కి ముందు సన్నాహకంలో భాగంగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేసిన పంత్, చాహల్.. కోచ్ వెబ్‌తో ఆటాడుకున్నారు.

Samayam Telugu 5 Jan 2020, 3:36 pm
ఆదివారం నుంచి శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గువాహటిలో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా సభ్యులు సర్వం సన్నద్ధమవుతున్నారు. ఈక్రమంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్, యజ్వేంద్ర చాహల్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ నవ్వులు పూయించారు. ఈ వీడియోను సోషల్ మీడియలో పోస్టు చేయగా నవ్వులు పూయించింది. నెటిజన్లు దీనిపై సరదాగా స్పందిస్తున్నారు.
Samayam Telugu CHAHAL, PANTH


Read Also : ఈరోజే IND vs SL 1st T20.. భారత్ రికార్డులతో లంకేయుల్లో గుబులు

ఈ వీడియోలలో విపరీతంగా బాక్సింగ్ చేస్తూ పంత్, చాహల్ కనిపించారు. ముఖ్యంగా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్‌తో కలిసి చాలాసేపు సాధన చేశారు. పంత్ అయితే వెబ్ పంచ్‌లను కాచుకుంటూ సాధన చేశాడు. అయితే చమత్కారానికి మారుపేరయిన చాహల్ మాత్రం వెబ్‌పై పంచుల వర్షం కురింపించాడు. వెనకనుంచి పంత్ వచ్చి వెబ్‌ను పట్టుకోగా చాహల్ అదేపనిగా పంచులు విసిరాడు.

Read Also : IND vs SL 1st T20: భారత తుదిజట్టు .. కారణలివే..!
కాసేపటికి అక్కడి నుంచి పారిపోయిన చాహల్.. మళ్లీ తిరిగొచ్చి వెబ్‌పై పంచులు విసిరాడు. కొన్ని పంచులు పంత్‌కు కూడా తాకడం విశేషం. కాసేపటికే మరో వ్యక్తి వచ్చి పంత్ పట్టుకున్నాడు. తేరుకున్న వెబ్.. చాహల్ కోసం వెతికాడు. చాలా సరదాగా సాగిన ఈ వీడియోలను రిషబ్ పంత్ నెట్‌లో పెట్టాడు. వెంటనే వైరల్‌గా మారాయి. అభిమానులు లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Read Also : వరల్డ్ రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ.. రోహిత్‌కు షాకేనా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.