యాప్నగరం

ధోనీ టెస్టులకు తిరిగొస్తే బావుంటుంది!

సఫారీ గడ్డ మీద టీమిండియాకు వరసగా ఎదురుదెబ్బలు తగులుతుండే సరికి.. భారత మాజీ క్రికెటర్లు కొత్త రకం విశ్లేషణలు వినిపిస్తున్నారు.

Samayam Telugu 17 Jan 2018, 1:20 pm
సఫారీ గడ్డ మీద టీమిండియాకు వరసగా ఎదురుదెబ్బలు తగులుతుండే సరికి.. భారత మాజీ క్రికెటర్లు కొత్త రకం విశ్లేషణలు వినిపిస్తున్నారు. ఒక విధంగా మాజీలే టీమిండియా మోరల్ స్ట్రెంగ్త్ మీద దెబ్బకొడుతున్నారు. దక్షిణాఫ్రికాలో టీమిండియా కోలుకునే అవకాశం లేదని.. వరస ఓటములు తప్పవన్నట్టుగా రెండో టెస్టుకు ముందే వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించగా.. ఇప్పుడు మరో మాజీ కెప్టెన్, లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... ధోనీ జట్టులో ఉండుంటే బావుండని అంటున్నారు.
Samayam Telugu team india needs dhoni in testsgavaskar
ధోనీ టెస్టులకు తిరిగొస్తే బావుంటుంది!


టెస్ట్ క్రికెట్ నుంచి ఇప్పటికే తప్పుకుని.. ఇక వన్డేల నుంచి కూడా ధోనీ తప్పుకుంటాడేమో.. అనే విశ్లేషణలు మొన్నటి వరకూ వినిపించగా, గవాస్కర్ మాత్రం.. ధోనీ తిరిగి టెస్టు జట్టులోకి రావాలని అంటున్నాడు.

ఇంతకీ ఈ మాజీ ప్లేయర్ ఏం చెబుతున్నాడంటే..‘ధోనీ టెస్టుల్లో ఆడటానికి సిద్ధంగా ఉంటే.. అతడు తక్షణం మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వొచ్చు. కెప్టెన్ గా బాధ్యతలు వదులుకున్న ధోనీ.. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ గా కొనసాగితే బావుంటుంది. ఆటు మైదానంలో, డ్రస్సింగ్ రూమ్ లో ధోనీ సలహాలు, సూచనలు ఆటగాళ్లకు కీలకం కాగలవు..’ అని అంటున్నాడు గవాస్కర్.

ఒకవేళ దక్షిణాప్రికాలో విరాట్ సేన పోరాట స్ఫూర్తిని కనబరిచి ఉంటే.. ధోనీ తిరిగి టెస్టుల్లోకి రావాలన్న మాటే వినిపించేది కాదు. అయితే రెండో టెస్టులో కూడా విరాట్ సేన ఓటమి ముంగిట నిలబడి ఉన్న నేపథ్యంలో.. ఒక్కసారిగా మాజీలకు ధోనీ గుర్తుకు వచ్చాడు. రెగ్యులర్ కీపర్ సాహా గాయపడి.. పార్థివ్ జట్టులోకి వచ్చి.. రెండో మ్యాచ్ లో పలు క్యాచ్ లు కూడా మిస్ చేయడంతో.. ధోనీ ఉంటే బావుండనే మాట వినిపిస్తోంది!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.