యాప్నగరం

సఫారీలపై తొలిసారి.. మూడో స్థానంలో టీమిండియా

తొలి టీ20లో 203 పరుగులు చేసిన టీమిండియా సఫారీలపై మొదటిసారి టీ20ల్లో 200కిపైగా పరుగులు చేసింది.

TNN 18 Feb 2018, 8:09 pm
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ధావన్ 39 బంతుల్లో 72 పరుగులు చేయడంతో టీ20ల్లో సౌతాఫ్రికాపై భారత్ తొలిసారిగా 200+ పరుగులు చేసింది. టీ20ల్లో భారత్ 200కిపైగా పరుగులు చేయడం ఇది తొమ్మిదోసారి. ఈ జాబితాలో టీమిండియా మూడో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 11 సార్లు (ఈ మ్యాచ్ ఫలితం తేలక ముందు వరకు), ఆస్ట్రేలియా పదిసార్లు చొప్పున 200కిపైగా పరుగులు సాధించాయి.
Samayam Telugu team india scores 200 runs in t20s for the 9th time
సఫారీలపై తొలిసారి.. మూడో స్థానంలో టీమిండియా


తొలి ఓవర్లో బౌండరీలతో విరుచుకుపడిన రోహిత్ (21), చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన రైనా (15) భారీ షాట్లు ఆడే క్రమంలో అనవసరంగా అవుటయ్యారు. క్రీజులో ఉన్నంత సేపు వీరు మెరుపులు మెరిపించారు. దీంతో టీమిండియా ఆరు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 78 రన్స్ చేసింది. పవర్ ప్లేలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.