యాప్నగరం

కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే కోట్లు రాలాల్సిందే!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేయడం ద్వారా ఎంత మొత్తంలో సంపాదిస్తున్నాడో తెలుసా?

TNN 9 Nov 2017, 2:55 pm
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటలోనే కాదు సంపాదనలోనూ దూసుకెళ్తున్నాడు. అత్యధిక మొత్తంలో ఆర్జిస్తున్న అథ్లెట్ల జాబితాను ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేయగా.. కోహ్లి మెస్సీ కంటే ముందున్న సంగతి తెలిసిందే. అతడి బ్రాండ్ వాల్యూ పట్ల కంపెనీలకు ఎంతో నమ్మకం ఉంది. ఈ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ సోషల్ మీడియాను కూడా సంపాదన మార్గంగా మలచుకున్నాడు. మైదానంలో అలవోకగా శతకాలు బాదే కోహ్లి.. సామాజిక మాధ్యమాల ద్వారా అంత కంటే తేలిగ్గా కోట్లు కొల్లగొడుతున్నాడు.
Samayam Telugu this is how much virat kohli earns for every instagram post
కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే కోట్లు రాలాల్సిందే!


విరాట్ కోహ్లికి ట్విట్టర్లో 20 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, ఇన్‌స్టా‌గ్రామ్‌లో 15 మిలియన్ల మంది, ఫేస్‌బుక్‌లో 36 మిలియన్ల మంది ఉన్నారు. ఏదైనా ఉత్పత్తి గురించి ప్రచారం చేసేలా కోహ్లి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయాలంటే కోట్లు ముట్టజెప్పాల్సిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రమోషనల్ పోస్ట్ కోసం విరాట్ అక్షరాలా ఐదు లక్షల డాలర్లు (రూ. 3.2 కోట్లు) వసూలు చేస్తున్నాడట. ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోతో సమానంగా విరాట్ ఛార్జ్ చేస్తుండటం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.