యాప్నగరం

ఒత్తిడిలో పాక్ బౌలర్లని ఉతికేశాడు..!

పాకిస్థాన్ గడ్డపై ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టీ20 సిరీస్.. ప్రపంచంలోని అంతర్జాతీయ క్రికెటర్లు

TNN 14 Sep 2017, 2:06 pm
పాకిస్థాన్ గడ్డపై ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టీ20 సిరీస్.. ప్రపంచంలోని అంతర్జాతీయ క్రికెటర్లు 11 మంది వలర్డ్ ఎలెవన్ జట్టుగా ఏర్పడి పోరాడినా.. తొలి మ్యాచ్‌లో అలవోకగా గెలిచిన పాకిస్థాన్ జట్టు బుధవారం రాత్రి కూడా రెండో టీ20లో గెలుస్తామని కాలరెగరేసింది. ఈ స్థితిలో 175 పరుగుల లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన వరల్డ్ ఎలెవన్ జట్టు రెండో టీ20లో గెలవాలంటే చివర్లో 21 బంతుల్లో 49 పరుగులు చేయాల్సి వచ్చింది. క్రీజులో ఆమ్లా, తిసార పెరీరా ఉన్నా.. పాక్ అభిమానులు తమ జట్టు బౌలింగ్‌పై నమ్మకంతో ధీమాగానే ఉన్నారు.
Samayam Telugu thisara perera hashim amla guide world xi to thrilling seven wicket win
ఒత్తిడిలో పాక్ బౌలర్లని ఉతికేశాడు..!


కానీ.. తిసార పెరీరా (47 నాటౌట్: 19 బంతుల్లో 5x6) అద్భుతమే చేశాడు. ఎవరూ ఊహించని విధంగా కెరీర్‌లోనే బెస్ట్ హిట్టింగ్ చేసేశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన సొహైల్ ఖాన్ బౌలింగ్‌లో సిక్స్‌తో టాప్ గేర్ వేసిన పెరీరా.. చివరికి సిక్స్‌తోనే ఒక బంతి మిగిలి ఉండగానే మ్యాచ్‌ని గెలుపుగా ముగించేశాడు. 18వ ఓవర్‌లో రయిస్ ఫుల్‌టాస్ బంతి విసరగా.. దాన్ని బౌండరీ అవలకి తరలించిన పెరీరా.. తర్వాత ఓవర్‌లో మళ్లీ సొహైల్ ఖాన్‌ విసిరిన రెండు ఫుల్‌టాస్ బంతుల్నీ సిక్సర్లగా మలిచి చుక్కలు చూపించేశాడు. ఈ ఓవర్‌లో ఏకంగా వరల్డ్ ఎలెవన్ జట్టు 20 పరుగులు పిండుకుంది. దీంతో చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం కాగా.. ఆమ్లా(70 నాటౌట్: 55 బంతుల్లో 5x4, 2x6)తో కలిసి తొలి నాలుగు బంతుల్లో ఏడు పరుగులు రాబట్టిన పెరీరా.. ఐదో బంతిని సిక్స్‌గా మలిచి టీ20 మజాని పాకిస్థాన్‌కి మరోసారి గుర్తు చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.