యాప్నగరం

భారత్‌పైనే ఇప్పుడు ఒత్తిడి: లంక కెప్టెన్

విశాఖపట్నంలో ఆదివారం జరగనున్న సిరీస్ నిర్ణయాత్మక వన్డేలో భారత్‌ జట్టుపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని శ్రీలంక కెప్టెన్

TNN 16 Dec 2017, 6:25 pm
విశాఖపట్నంలో ఆదివారం జరగనున్న సిరీస్ నిర్ణయాత్మక వన్డేలో భారత్‌ జట్టుపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని శ్రీలంక కెప్టెన్ తిసార పెరీరా అభిప్రాయపడ్డాడు. ధర్మశాల వన్డేలో ఘోర పరాజయం చవిచూసిన భారత్.. గత బుధవారం మొహాలి వేదికగా జరిగిన రెండో వన్డేలో 392 పరుగుల భారీ స్కోరు చేసి లంకేయుల్ని చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. దీంతో మూడో వన్డేలో ఏ జట్టు పైచేయి సాధిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. జట్టు విజయావకాశాలపై శనివారం మీడియాతో తిసార పెరీరా మాట్లాడాడు.
Samayam Telugu thisara perera hopeful of sri lanka doing something special at visakhapatnam against india
భారత్‌పైనే ఇప్పుడు ఒత్తిడి: లంక కెప్టెన్


‘మొహాలి, ధర్మశాలతో పోలిస్తే విశాఖపట్నం వాతావరణం చాలా భిన్నం. ఇంకా చెప్పాలంటే శ్రీలంకని పోలి ఉంటుంది. తుది వన్డే కోసం మేము చాలా కష్టపడ్డాం. ధర్మశాల వన్డే తరహాలో మరోసారి భారత్‌పై మెరుగైన ప్రదర్శన చేయాలనే ధీమాతో ఉన్నాం. ఇప్పటికే రెండు ప్రాక్టీస్ సెషన్స్ ముగిశాయి. విజేత నిర్ణయాత్మక వన్డే అయినప్పటికీ మాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. ఇది మరో మ్యాచ్‌లానే భావిస్తున్నాం. కానీ.. భారత్ జట్టు ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఒకటి. కాబట్టి.. వారిపై మాత్రం తప్పకుండా ఒత్తిడి ఉంటుంది’ అని తిసార పెరీరా వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.