యాప్నగరం

కెప్టెన్‌ ఛేంజ్.. లాహోర్‌కి వెళ్తోన్న శ్రీలంక

పాకిస్థాన్‌లో భద్రతా కారణాలతో లాహోర్‌లో టీ20 మ్యాచ్ ఆడేందుకు గత కొద్దిరోజులుగా నిరాకరిస్తున్న శ్రీలంక క్రికెటర్లు

TNN 21 Oct 2017, 6:22 pm
పాకిస్థాన్‌లో భద్రతా కారణాలతో లాహోర్‌లో టీ20 మ్యాచ్ ఆడేందుకు గత కొద్దిరోజులుగా నిరాకరిస్తున్న శ్రీలంక క్రికెటర్లు ఎట్టకేలకి పట్టువీడారు. ప్రస్తుతం దుబాయ్ వేదికగా పాకిస్థాన్, శ్రీలంక మధ్య సుదీర్ఘ సిరీస్ జరుగుతుండగా.. చివరిదైన టీ20 మ్యాచ్‌ లాహోర్‌లో ఆడేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే.. 2009‌లో లాహోర్‌లో తమ జట్టుపై కాల్పుల ఘటనని గుర్తు చేసుకుంటున్న శ్రీలంక క్రికెటర్లు ఈ మ్యాచ్‌ వేదికను మార్చాల్సిందిగా ఆ దేశ క్రికెట్ బోర్డుకి ఇటీవల లేఖ రాశారు. దీంతో ఈ టీ20 జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ.. శ్రీలంక బోర్డు పట్టువీడకుండా.. కెప్టెన్ ఉపుల్ తరంగ పక్కకి తప్పుకున్నా తాత్కాలిక కెప్టెన్‌ని నియమించి మరీ తాజాగా జట్టు ప్రకటించింది.
Samayam Telugu thisara perera named sri lankas captain for t20is against pakistan
కెప్టెన్‌ ఛేంజ్.. లాహోర్‌కి వెళ్తోన్న శ్రీలంక


సిరీస్‌లో భాగంగా మొత్తం మూడు టీ20లు జరగాల్సి ఉండగా.. రెండు అబుదాబిలో జరగనున్నాయి. చివరి టీ20 మ్యాచ్ మాత్రం అక్టోబరు 29న లాహోర్‌లో జరగనుంది. దీంతో ఈ సిరీస్‌కి మొత్తంగా జట్టుని తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. లాహోర్‌ పర్యటనని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఉపుల్ తరంగ పక్కకి తప్పుకోగా.. అతని స్థానంలో తిసారా పెరీరాకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ప్రధాన జట్టులోని ఆరుగురు క్రికెటర్లు మాత్రమే.. ఈ పర్యటనకి అంగీకరించగా.. మిగిలిన వారి స్థానంలో యువ క్రికెటర్లకి అవకాశమిచ్చారు. ఇటీవల నిషేధానికి గురైన గుణతిలక, శ్రీలంక- ఎ జట్టు తరఫున ఆడుతున్న శనకకి ఈ జట్టులో చోటిచ్చారు. ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ లాహోర్ పర్యటనని నిరాకరించడంతో అతను టీ20 జట్టు నుంచి చోటు కోల్పోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.