యాప్నగరం

ఆ సాయం మరువలేనిది: హనుమ విహారి

భారత టెస్టు జట్టులోకి అనూహ్యంగా ఎంపికై అందర్నీ ఆశ్చర్యపరిచాడు హనుమ విహారి. ఇంగ్లాండ్‌తో 4, 5వ టెస్టుల కోసం ఇటీవల భారత

Samayam Telugu 24 Aug 2018, 9:16 pm
భారత టెస్టు జట్టులోకి అనూహ్యంగా ఎంపికై అందర్నీ ఆశ్చర్యపరిచాడు హనుమ విహారి. ఇంగ్లాండ్‌తో 4, 5వ టెస్టుల కోసం ఇటీవల భారత సెలక్టర్లు 18 మందితో కూడిన జట్టుని ఎంపిక చేయగా.. అందులో హనుమ విహారికి చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ నెల ఆరంభంలో దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హనుమ విహారి 148 పరుగులు చేసి సెలక్టర్లను మెప్పించాడు. దీంతో.. ఈ 24 ఏళ్ల హిట్టర్‌కి భారత జట్టులో చోటు దక్కింది. అయితే.. తాను ఈ స్థాయికి చేరడానికి దిగ్గజ క్రికెటర్లు వీవీఎస్‌ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్‌ చాలా సాయం చేశారని హనుమ విహారి చెప్పుకొచ్చాడు. ఈ నెల 30 నుంచి ఇంగ్లాండ్‌తో భారత్ జట్టు నాలుగో టెస్టు మ్యాచ్ ఆడనుంది.
Samayam Telugu time spent with vvs laxman at srh helped me a lot hanuma vihari
ఆ సాయం మరువలేనిది: హనుమ విహారి


‘హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ నాకు స్ఫూర్తి. అతనో దిగ్గజ క్రికెటర్. అతనితో కలిసి కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కింది.. అవి నా కెరీర్‌కి ఎంతో ఉపయోగపడ్డాయి. నా ఆట మెరుగయ్యేందుకు అతను చాలా సూచనలు చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరఫున ఆడేటప్పుడు.. కూడా అతను జట్టుకి మెంటార్‌గా ఉండటంతో.. టీ20‌ల్లో ఆట గురించి చర్చించేవాళ్లం. అతను నాకు చాలా స్వేచ్ఛనిచ్చేవారు. అలానే భారత-ఎ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌ సూచనలు కూడా నా ఆట మెరుగయ్యేందుకు దోహదపడ్డాయి’ అని హనుమ విహారి వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.