యాప్నగరం

వాట్ ఏ క్యాచ్.. ఇలా క్యాచ్ పట్టడం చూశారా?

బ్యాట్స్‌మెన్ స్వీప్ షాట్ ఆడాడు.. ఫీల్డర్ అతడి పక్కనే షార్ట్ లెగ్‌లో ఉన్నాడు. అలాంటప్పుడు క్యాచ్ పట్టడం సాధ్యమేనా?

TNN 26 Mar 2017, 2:45 pm
హమిల్టన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ ప్లేయర్ టామ్ లాథమ్ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. సౌతాఫ్రికా 190/5తో తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న దశలో ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్‌ను డిఫరెంట్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. శాంట్నర్ ఫుల్ బాల్ విసరగా.. డుప్లెసిస్ దాన్ని స్వీప్ షాట్ ఆడాడు. బ్యాట్స్‌మెన్ పక్కనే షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న లాథమ్ ఒంటి చేత్తో దాన్ని ఒడిసి పెట్టుకున్నాడు. బ్యాట్స్‌మెన్ కదలికలను తీక్షణంగా గమనిస్తోన్న లాథమ్... స్వీప్ షాట్ ఆడేందుకు డుప్లెసిస్ ముందుకు వంగగానే వెనక్కి వెళ్లి.. తన నుంచి దూరంగా వెళ్తోన్న బంతిని గాల్లోకి ఎగిరి మరీ అందుకున్నాడు.
Samayam Telugu tom latham takes sensational close range catch to send south african skipper packing
వాట్ ఏ క్యాచ్.. ఇలా క్యాచ్ పట్టడం చూశారా?


లాథమ్ సూపర్ క్యాచ్ చూసిన కివీస్ ప్లేయర్లు అతణ్ని అభినందించకుండా ఉండలేకపోయారు. లాథమ్ అద్భుతమైన ఫీల్డింగ్ కారణంగా సఫారీల కెప్టెన్ 53 పరుగుల వద్ద పెవిలియన్ చేరగా.. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో రోజు ఆట ముగిసే న్యూజిలాండ్ జట్టు వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. లాథమ్ 42 రన్స్, జీత్ రావల్ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు.

How good!? - Tom Latham's in-close-running-one-hander to remove Faf du Plessis #NZvSA ^WN pic.twitter.com/8b2PtYvT6K — BLACKCAPS (@BLACKCAPS) March 26, 2017
ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ తుది అంకాని చేరుకుంది. తొలి టెస్టు డ్రాగా ముగియగా, రెండో టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్ సమం చేయాలని కివీస్ ప్లేయర్లు పట్టుదలతో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.