యాప్నగరం

నకిలీ డిగ్రీతో డీఎస్పీ ఉద్యోగం.. చిక్కుల్లో క్రికెటర్

భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ చిక్కుల్లో పడింది. ఆమె ఈ ఏడాది మార్చిలో నకిలీ డిగ్రీ సర్టిఫికేట్స్ సమర్పించి పంజాబ్ పోలీసు శాఖలో డీఎస్పీ

Samayam Telugu 3 Jul 2018, 8:35 am
భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ చిక్కుల్లో పడింది. ఆమె ఈ ఏడాది మార్చిలో నకిలీ డిగ్రీ సర్టిఫికేట్స్ సమర్పించి పంజాబ్ పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగాన్ని సంపాదించిందని తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. గత ఏడాది ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. ఒంటిచేత్తో భారత్‌ని ఫైనల్‌కి చేర్చింది.
Samayam Telugu harmanpreet-kaur759


ప్రపంచకప్‌లో ఆమె బ్యాటింగ్‌ ప్రదర్శనకి మెచ్చిన పంజాబ్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగాన్ని ఆఫర్ చేయగా.. ఈ ఏడాది మార్చి 1న హర్మన్‌ప్రీత్ కౌర్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టింది. కానీ.. ఉద్యోగంలో చేరే సమయంలో ఆమె సమర్పించిన ధ్రువపత్రాలు నకిలీవని పంజాబ్‌ పోలీసులు తాజాగా తేల్చినట్లు వార్తలు వస్తున్నాయి.

తనపై ఆరోపణలు రావడంతో హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించింది. ‘నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగంలో చేరాననే ఆరోపణల్లో నిజం లేదు. అయినా.. అలా చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. పంజాబ్ పోలీసు శాఖతో మాట్లాడిన తర్వాత అన్ని వివరాలు తెలియజేస్తాను’ అని ఈ మహిళా హిట్టర్ వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.