యాప్నగరం

ధోనీ రిటైర్మెంట్ దెబ్బకి ట్విట్టర్ షేక్.. ఫ్యాన్స్ భావోద్వేగం

2019 వన్డే ప్రపంచకప్‌ నుంచి ధోనీ రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతోంది. కానీ.. ధోనీ మాత్రం కనీసం ఒక్కసారి కూడా స్పందించలేదు. శనివారం స్పందించాడు.. దాంతో ఆ టాపిక్‌కి తెరపడింది. ఇదీ ధోనీ స్టయిల్.

Samayam Telugu 15 Aug 2020, 11:42 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ క్యాంప్‌నకి శనివారం హాజరైన ధోనీ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు చెప్తున్నట్లు ప్రకటించాడు. దాంతో.. భారత క్రికెట్ అభిమానులు ధోనీ ఘనతల్ని గుర్తు చేసుకుంటూ ఫొటోలు, వీడియోల్ని ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు. అభిమానులే కాదు.. ధోనీ సహచర క్రికెటర్లు కూడా అతనితో తమకి ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.
Samayam Telugu ​MS Dhoni
MS Dhoni. (Photo by Hagen Hopkins/Getty Images)


Read More:భారత క్రికెట్‌లో మరో షాక్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కి సురేశ్ రైనా గుడ్‌ బై

దేశం, ప్రాంతం, ప్రత్యర్థితో సంబంధం లేకుండా అభిమానుల్ని సంపాదించుకున్న క్రికెటర్లు ఇద్దరే ఇద్దరు. అందులో మొదటి స్థానం సచిన్ టెండూల్కర్‌దికాగా.. రెండో క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ. కెప్టెన్‌గా 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ధోనీ.. ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్‌గానే కాకుండా.. వరల్డ్‌లోనే బెస్ట్ ఫినిషర్‌గా కితాబులు అందుకున్న ధోనీ.. కీపింగ్‌లోనూ తనకి తిరుగులేదని ఎన్నోసార్లు నిరూపించాడు.

Read More:ధోనీ రనౌట్ లెక్క.. ఎక్కడ మొదలెట్టాడో..? అక్కడే ముగించాడు..!


మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా సహనంతో వ్యవహరించే ధోనీ.. కెప్టెన్ కూల్‌‌గా అందరితో ప్రశంసలు అందుకున్నాడు. అలానే క్లిష్ట సమయాల్లోనూ తన వ్యూహ చతురతతో మ్యాచ్‌ల్ని గెలిపించడం ధోనీ స్టయిల్. ధోనీ ఆలోచనలు, వ్యూహాలు అతనితో కలిసి 20 ఏళ్లు ట్రావెల్ చేసిన వారికి కూడా అంతుచిక్కవని మాజీ క్రికెటర్లు చెప్తుంటారు. మొత్తంగా.. టీమిండియాని విజయవంతమైన జట్టుగా తీర్చిదిద్దిన ధోనీ.. వీడ్కోలు మ్యాచ్‌ కోసం వెయిట్ చేయకుండానే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇలా అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పడం కూడా ధోనీ స్టయిల్‌లో ఒక భాగమే. 2014లో టెస్టులకి వీడ్కోలు కూడా ఇలానే సడన్‌గా చెప్పేశాడు.

Read More: ధోనీ కీపింగ్ వేగానికి ఈ స్టంపౌట్స్ మచ్చుతునకలు.. వీడియో











తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.