యాప్నగరం

U-19 వరల్డ్‌కప్‌లో గొడవపడిన భారత్, బంగ్లా క్రికెటర్లపై సస్పెన్షన్ పాయింట్లు

క్రికెట్ చరిత్రలో తొలిసారి ఐసీసీ వరల్డ్‌కప్ గెలిచిన బంగ్లాదేశ్ టీమ్.. మైదానంలో హద్దులు మీరి సంబరాలు చేసుకుంది. ఈ క్రమంలో భారత్ ఆటగాళ్లని వారు కవ్వించడంతో ఇరు జట్ల ఆటగాళ్లు బాహాబాహీకి దిగారు.

Samayam Telugu 12 Feb 2020, 10:45 am
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ అనంతరం గొడవపడిన భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై గత ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలుపొందిన బంగ్లాదేశ్ టీమ్.. భారత జట్టుని కవ్విస్తూ మైదానంలో సంబరాలు చేసుకుంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ముగ్గురు బంగ్లాదేశ్, ఇద్దరు భారత క్రికెటర్లు హద్దులు మీరి బాహాబాహీకి దిగారు. దీంతో.. ఈ ఘటనపై ఐసీసీ సీరియస్ అయ్యింది.
Samayam Telugu India U-19



మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిచిన తర్వాత మైదానంలోకి దూసుకొచ్చిన ఆ జట్టు క్రికెటర్లు తౌహిద్, రకీబుల్ హసన్, షమీమ్ భారత ఆటగాళ్లని కవ్విస్తూ వెకిలి చేష్టలకి పాల్పడ్డారు. దీంతో.. కాసేపు మౌనంగా చూసిన భారత క్రికెటర్లు.. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఆటగాళ్లు మరీ హద్దు దాటడంతో ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో రవి బిష్ణోయ్, ఆకాశ్ సింగ్.. బంగ్లాదేశ్ క్రికెటర్లపైకి దూసుకెళ్లారు. దీంతో.. వీడియోలని నిశితంగా పరిశీలించిన ఐసీసీ.. మొత్తం ఐదుగురు ఆటగాళ్లపై సస్పెన్షన్ పాయింట్లను విధించింది.

మైదానంలో మొదట భారత్ ఆటగాళ్లని కవ్వించి గొడవకి కారణమైన తౌహిద్‌కి 10 సస్పెన్షన్ పాయింట్లని విధించిన ఐసీసీ.. ఆ తర్వాత షమీమ్, ఆకాశ్‌కి చెరో 8 పాయింట్లు, బిష్ణోయ్‌కి 5, రకీబుల్‌కి 4 పాయింట్లని కేటాయించింది. ఒక సస్పెన్షన్ పాయింట్‌తో ఒక్క మ్యాచ్‌కి ఆటగాడు దూరమవుతాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.