యాప్నగరం

అంపైర్ తప్పిదంతో.. ఆమ్లా బతికిపోయాడు

పోర్ట్ ఎలిజిబెత్‌లో జరుగుతోన్న ఐదో వన్డేలో రహానే క్యాచ్ జారవిడవడం, అంపైర్ తప్పిదాల కారణంగా ఆమ్లాకు రెండుసార్లు లైఫ్ వచ్చింది.

TNN 13 Feb 2018, 11:12 pm
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరుగుతోన్న ఐదో వన్డేలో హషీమ్ ఆమ్లా కొద్దిలో బతికిపోయాడు. చాహల్ బౌలింగ్‌లో బంతి ప్యాడ్‌కు తగలగా ఫీల్డర్లు అపీల్ చేశారు. కానీ అంపైర్ షాన్ జార్జ్ అవుటివ్వలేదు. ‘హాక్ ఐ’లో బంతి లెగ్ స్టంప్‌ను తాకుతున్నట్లు తేలింది. కానీ భారత్‌ ఖాతాలో రివ్యూలు లేకపోవడం ఆమ్లాకు కలిసి వచ్చింది. అంతకు ముందు చాహల్ బౌలింగ్‌లో మిల్లర్ ఎల్బీ కోసం అప్పీల్ చేసినా.. అంపైర్ స్పందించలేదు. దీంతో ధోనీని సంప్రదించిన కోహ్లి డీఆర్ఎస్ కోరాడు. కానీ బంతి ఎక్కువగా టర్న్ అవుతూ లెంగ్ స్టంప్‌కు కొద్ది దూరంగా వెళ్తున్నట్లు తేలింది.
Samayam Telugu umpire wrong decision helps amla to survive
అంపైర్ తప్పిదంతో.. ఆమ్లా బతికిపోయాడు


భారత్‌కు రివ్యూ కోరే ఛాన్స్ లేకపోవడం వల్ల ఆమ్లా బతికిపోయాడు. అంతకు ముందు ఆమ్లా క్యాచ్‌ను రహానే నేలపాలు చేయడం కూడా సౌతాఫ్రికాకు కలిసి వచ్చింది.

ఈ సిరీస్‌లో తొలి అర్ధ సెంచరీ సాధించిన ఆమ్లా.. వన్డేల్లో 7500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 160 ఇన్నింగ్స్ ఆడిన ఆమ్లా.. 50కిపైగా సగటుతో 26 సెంచరీల సాయంతో ఈ ఫీట్ చేరుకోవడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.