యాప్నగరం

ఆసీస్‌పై మ్యాచ్ అధికారుల కొరడా .. పెనాల్టీతో హెచ్చరికలు (వీడియో)

మూడు టెస్టుల సిరీస్‌ను గెలిచి ఉత్సాహం మీద ఉన్న ఆస్ట్రేలియాకు అంతకుముందు అంపైర్లు కొరడా ఝుళిపించారు. పిచ్‌పై నడిచినందుకుగాను కివీస్ ఇన్నింగ్స్‌లో ఐదు పరుగులను అదనంగా కలిపారు.

Samayam Telugu 6 Jan 2020, 3:24 pm
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ట్రాన్స్ టాస్మన్ ప్రత్యర్థుల మధ్య జరిగిన సిరీస్ ఏకపక్షంగా ముగిసింది. అన్ని మ్యాచ్‌ల్లో కనీసం 270 రన్స్ ‌తేడాతో కంగారూలు గెలుపొందారు. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన ఒక సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన చేసిన అంపైర్లు.. ఆసీస్‌పై ఐదు పరుగుల పెనాల్టీని విధించారు.
Samayam Telugu umpires slap australia with 5 runs penalty
ఆసీస్‌పై మ్యాచ్ అధికారుల కొరడా .. పెనాల్టీతో హెచ్చరికలు (వీడియో)


Read Also : ఆస్ట్రేలియా చేతిలో 3-0తో న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్

ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఈ సంఘటన జరిగింది. కివీస్ పేసర్ మ్యా్ట్ హెన్రీ వేసిన 50వ ఓవర్లో కంగారూ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఒక తప్పిదానికి పాల్పడ్డాడు. బంతిని ఎదుర్కొన్న తర్వాత పిచ్‌పై డేంజర్ ఎండ్‌పై నడిచాడు. దీంతో అంపైర్ నిబంధనల ప్రకారం ఐదు పరుగుల పెనాల్టీని విధించారు. దీంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ డైరెక్టుగా 5/0తో ప్రారంభమైంది.

Read Also : ఇర్ఫాన్ పఠాన్: నా కెరీర్ పతనానికి ఆ నిర్ణయాలే కారణం!
ఈ సంఘటనకు సంబంధించిన ఐసీసీ ప్రవర్తన నియమావళిలో స్పస్టమైన నిబంధనలు ఉన్నాయి. ఎంసీసీ లా ఆఫ్ క్రికెట్ నిబంధన 41.14 ప్రకారం పిచ్‌ను నష్టం కలిగిస్తే వారు శిక్షార్హులవుతారు. ఇరువైపులా పాపింగ్ క్రీజు మధ్య 60 సెంటీమీటర్ల దీర్ఘ చతురస్త్రాకారపు స్థలంలో ఎవరైనా అడుగుపెడితే అది శిక్షార్హం అవుతుంది. దీనిపై అంపైర్లు చర్యలు తీసుకుంటారు. కంగారూ బ్యాట్స్‌మెన్ తప్పు చేయడంతో ఆసీస్ సాధించిన విజయంలో ఐదు పరుగుల మేర కోత పడిందని చెప్పవచ్చు.

Read Also : IND vs SL తొలి టీ20 రద్దు.. కారణాలివే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.