యాప్నగరం

ఆసియా కప్ ఆతిథ్యం కోల్పోయిన బెంగళూరు

అండర్-19 ఆసియా కప్‌ టోర్నీకి ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని బెంగళూరు కోల్పోయింది. ఈ ఏడాది నవంబరులో జరగాల్సిన

TNN 12 Aug 2017, 7:03 pm
అండర్-19 ఆసియా కప్‌ టోర్నీకి ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని బెంగళూరు కోల్పోయింది. ఈ ఏడాది నవంబరులో జరగాల్సిన ఆసియా కప్‌ని తొలుత బెంగళూరులో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. తమ క్రికెటర్ల భద్రతపై పాకిస్థాన్ అభ్యంతరాలు చెప్పడంతో తాజాగా మలేషియాకి ఈ టోర్నీని తరలించారు. ఆసియా కప్ కోసం బెంగళూరుకి పాక్‌ జట్టును పంపితే ఇరు దేశాల మధ్య ఇప్పటికే నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం మరింత పెరుగుతుందని టోర్నీ నిర్వాహకులు కూడా ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Samayam Telugu under 19 asia cup moved to malaysia
ఆసియా కప్ ఆతిథ్యం కోల్పోయిన బెంగళూరు


ఈ టోర్నీ కోసం భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు నేరుగా అర్హత సాధించగా.. మరో నాలుగు జట్లు క్వాలిఫయర్ ద్వారా రానున్నాయి. ‘ఈ టోర్నీని మలేషియాకి తరలించేందుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అన్ని జట్లు ఏకగ్రీవంగా అంగీకరించాయి. అక్కడైతే భద్రతా పరమైన సమస్యలు కూడా తలెత్తవని మా భావన’ అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నిజాం సేథి వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.