క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో విరాట్ కోహ్లీని పోల్చడం సరికాదని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. తన అద్భుతమైన ఆటతీరుతో దేశ క్రికెట్ అభిమానుల హృదయాలను దోచుకుంటున్న విరాట్ కోహ్లీని ఈ మధ్య కాలంలో చాలామంది సచిన్ తో పోల్చడం ప్రారంభించారు. దీన్ని యువరాజ్ సింగ్ కూడా గతంలో తప్పుపట్టాడు. విరాట్ కోహ్లీ మంచి ఆటగాడే అయినప్పటికీ అతను ఇంకా నిరూపించుకోవాల్సింది ఎంతో ఉందని కొద్ది రోజుల క్రితం యువరాజ్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై సెహ్వాగ్ స్పందించాడు. ఈ తరహా పోలికలు ఏమాత్రం సరికాదని ఈ సందర్భంగా సెహ్వాగ్ చెప్పాడు. ఎవరి ప్రత్యేకత వారిదేనని, ఒకరిని ఒకరితో పోల్చరాదన్నాడు. తనను కూడా కొందరు సచిన్ తో, వివ్ రిచర్డ్స్ తో పోల్చుతుండేవారని గుర్తుచేసుకున్నాడు. విరాట్ కు మంచి భవిష్యత్ ఉందని, ఈ ఐపీఎల్ సీజన్లో ప్రమాదకరమైన బ్యాట్స్‌మ్యాన్‌గా కోహ్లీని అభివర్ణించాడు.
సచిన్‌తో కోహ్లీకి పోలికా..ఇక చాలు ఆపండి
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో విరాట్ కోహ్లీని పోల్చడం సరికాదని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు.
TNN 11 May 2016, 9:39 pm