యాప్నగరం

భారత జట్టు ఎంపికపై వెంగ్‌సర్కార్ ఫైర్..!

భారత జట్టు ఎంపికపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన మూడో వన్డేలో కేఎల్ రాహుల్‌కి తుది జట్టులో

Samayam Telugu 20 Jul 2018, 1:00 pm
భారత జట్టు ఎంపికపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన మూడో వన్డేలో కేఎల్ రాహుల్‌కి తుది జట్టులో చోటివ్వకపోవడంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పెదవి విరచగా.. తాజాగా జట్టు ఎంపిక తీరును మాజీ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఎండగట్టాడు. అఫ్గానిస్థాన్‌తో టెస్టు మ్యాచ్‌కి భారత్‌ కెప్టెన్‌ పనిచేసిన అజింక్య రహానెకి.. వన్డే జట్టులో చోటివ్వకపోవడం అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమేనని ఈ మాజీ సెలక్టర్ వివరించాడు.
Samayam Telugu DhM9rdSXcAAkqRA


‘భారత జట్టులో అసలేం జరుగుతోంది..? జట్టులో అగ్రశ్రేణి ఆటగాళ్ల‌తో కుర్చీలాట ఆడుతున్నారా..? బ్యాటింగ్ ఆర్డర్‌లో జట్టుకి 3, 4వ స్థానాలు ఆడే ఆటగాళ్లు కీలకం. అలాంటి స్థానాల్లో జట్టులో రెగ్యులర్‌గా అవకాశాలు దక్కని ఆటగాళ్లను ఆడిస్తుంటారా..? ఇలా చేయడంతోనే వన్డేలో ఇప్పటికీ 4వ స్థానంలో మెరుగైన ఆటగాడు దొరకలేదు. అఫ్గానిస్థాన్‌తో టెస్టుకి కెప్టెన్‌గా పనిచేసిన రహానెని.. వెంటనే వన్డే జట్టు నుంచి ఎలా తప్పిస్తారు..? అంటే జట్టులోని అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌పై మీకు నమ్మకం లేదా..?’ అని వెంగ్‌సర్కార్ ప్రశ్నించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.