యాప్నగరం

కోచ్ రేసులోకి వెంకటేష్ ప్రసాద్

భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి పోటీ పెరిగిపోతోంది. టీం ఇండియా కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే తప్పుకోవడంతో బీసీసీఐ కొత్త కోచ్ వేట మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

TNN 29 Jun 2017, 9:09 am
భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి పోటీ పెరిగిపోతోంది. టీం ఇండియా కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే తప్పుకోవడంతో బీసీసీఐ కొత్త కోచ్ వేట మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, లాల్‌చంద్ రాజ్‌పుత్, దొడ్డ గణేష్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా టీం ఇండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి కూడా కచ్చీఫ్ వేశారు. ఇప్పుడు భారత మాజీ సీమర్ వెంకటేష్ ప్రసాద్ రేసులోకి వచ్చారు.
Samayam Telugu venkatesh prasad joins fray for india coach
కోచ్ రేసులోకి వెంకటేష్ ప్రసాద్


వెంకటేష్ ప్రసాద్ ప్రస్తుతం జూనియర్ నేషనల్ చీఫ్ సెలక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి తన మూడేళ్ల పదవీకాలం ముగుస్తుంది. అందుకని గతంలో బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన ఈ 46 ఏళ్ల సీనియర్ క్రికెటర్ ఇప్పుడు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. భారత్ తరఫున 33 టెస్టులు, 162 వన్డేలు ఆడిన రికార్డు వెంకటేష్ సొంతం. అయితే సెహ్వాగ్, టామ్ మూడీ వంటి స్టార్లతో వెంకటేష్ పోటీ పడగలడో లేదో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.