యాప్నగరం

ఇరానీ కప్‌ను సొంతం చేసుకున్న విదర్భ

విదర్భ జట్టు మరోసారి అద్భుతం చేసింది. ఇప్పటికే రంజీ ట్రోఫీని గెలుచుకున్న విదర్భ.. ఇరానీ కప్‌ను కూడా ఖాతాలో వేసుకుంది.

Samayam Telugu 18 Mar 2018, 4:35 pm
విదర్భ క్రికెట్ జట్టు ఇరానీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాల్లేకుండా.. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనతో రంజీ ట్రోఫీని కైవసం చేసుకున్న విదర్భ.. తొలిసారి ఇరానీ కప్‌ను కూడా ఎగరేసుకు పోయింది. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఫయజ్ ఫజల్ సేన 800/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వసీం జాఫర్ (286 పరుగులు) సత్తా చాటాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జాఫర్‌కి ఇది 53వ శతకం కావడం విశేషం. అతడికి తోడుగా.. గణేష్ సతీష్ (120), అపూర్వ్ వాంఖడే (157) సెంచరీలు సాధించడంతో విదర్భ జట్టు ఇరానీ కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించింది.
Samayam Telugu virabha cricket team becomes the irani trophy champions
ఇరానీ కప్‌ను సొంతం చేసుకున్న విదర్భ


కొండంత లక్ష్యంతో బరిలో దిగిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌట్ అయ్యింది. హనుమ విహారి 183 పరుగులతో రాణించాడు. పృథ్వీ షా (53), జయంత్ యాదవ్ (91) అర్ధ సెంచరీలు సాధించగా.. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.

410 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఉన్నప్పటికీ.. విదర్భ జట్టు ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించలేదు. చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగియగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విదర్భ జట్టు ఇరానీ కప్‌ను సొంతం చేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.