యాప్నగరం

ఇండియా హౌజ్‌ను సందర్శించిన టీమిండియా

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు ‘ఇండియా హౌజ్‌’ను సందర్శించింది.

TNN 12 Jan 2018, 10:31 am
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు ‘ఇండియా హౌజ్‌’ను సందర్శించింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రితోపాటు ఇతర ఆటగాళ్లు ఇండియా హౌజ్‌లో ఉన్న ఫొటోలను బీసీసీఐ ట్వీట్ చేసింది. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, సౌతాఫ్రికా యునైటెడ్ క్రికెట్ బోర్డ్ అడ్మినిస్ట్రేటర్ అలీ బాచర్‌ను టీమిండియా ఆటగాళ్లు కలిశారు. ఈ సందర్భంగా బాచర్‌తో రవిశాస్త్రి ముచ్చటించారు. ఇండియా హౌజ్‌ను సందర్శించిన వారిలో శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, బుమ్రా, మురళీ విజయ్, హార్దిక్ పాండ్య, భునేశ్వర్ కుమార్, రహానే ఉన్నారు.
Samayam Telugu virat kohli and co visit india house in johannesburg
ఇండియా హౌజ్‌ను సందర్శించిన టీమిండియా


తోటి క్రికెటర్లతో కలిసి జొహన్నెస్‌బర్గ్‌లోని భారత హైకమిషనర్ హౌజ్‌ను సందర్శించడం సంతోషంగా ఉందని శిఖర్ ధావన్ ఈ సందర్భంగా ట్వీట్ చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్ శనివారం నుంచి రెండో టెస్టులో తలపడనుంది. మొదటి మ్యాచ్‌లో ఓటమితో ఒత్తిడిలో ఉన్న టీమిండియా, రెండో టెస్టులో కీలక మార్పులు చేసే అవకాశాలున్నాయి.

.#TeamIndia visit India House at Johannesburg pic.twitter.com/eHG805V3DY — BCCI (@BCCI) January 11, 2018

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.