యాప్నగరం

చెన్నైలో విఫలం.. కోహ్లి, అశ్విన్ రికార్డులు మిస్

ఏడాది మొత్తం రాణించి.. చెన్నై టెస్టులో విఫలమైన భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్‌లు చక్కటి అవకాశాన్ని కోల్పోయారు.

TNN 20 Dec 2016, 7:12 pm
ఏడాది మొత్తం రాణించి.. చెన్నై టెస్టులో విఫలమైన భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్‌లు చక్కటి అవకాశాన్ని కోల్పోయారు. భారత్ తరఫున ఓ క్యాలెండర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ద్రవిడ్ రికార్డును కోహ్లి అధిగమిస్తాడని భావించగా.. కేవలం 31 పరుగులు మాత్రమే వెనకబడిపోయాడు. 1999లో ద్రవిడ్ 2626 పరుగులు చేయగా.. ఈ ఏడాది కోహ్లి 2595 పరుగులు చేశాడు. టెస్టుల్లో ఈ సంవత్సరం 1215 రన్స్ చేసిన కోహ్లి, వన్డేల్లో 739 పరుగులు, టీ20ల్లో 641 పరుగులు చేశాడు. 1999లో ద్రవిడ్ 62 ఇన్నింగ్స్ ఆడగా.. ఈ ఏడాది కోహ్లి కేవలం 41 ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు. విరాట్ ఎంత దూకుడుగా ఆడినా.. చెన్న టెస్టులో 15 పరుగులు మాత్రమే చేయడంతో రాహుల్ రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు.
Samayam Telugu virat kohli and ravichandran ashwin miss the records due to failure in chennai test
చెన్నైలో విఫలం.. కోహ్లి, అశ్విన్ రికార్డులు మిస్


భారత ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ కూడా చెన్నై టెస్టులో ఒక్క వికెట్ మాత్రమే తీసి మూడు వికెట్ల తేడాతో కపిల్ దేవ్ రికార్డును మిస్సయాడు. 1983లో భారత్‌కు వన్డే ప్రపంచ కప్ సాధించిపెట్టిన కపిల్.. ఆ ఏడాది టెస్టుల్లో 75 వికెట్లు తీశాడు. 2016లో అశ్విన్ 72 వికెట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చెన్నైలో తన స్థాయి తగ్గ ప్రదర్శన చేసి ఉంటే.. అశ్విన్ కచ్చితంగా కపిల్ రికార్డును బ్రేక్ చేసేవాడే. కానీ సొంత గడ్డ మీద సీన్ రివర్స్ కావడంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాళ్ల నాలుగో స్థానంలో ఉన్నాడు. కపిల్ 1979లో 74 వికెట్లు తీయగా, కుంబ్లే 2004లో 74 వికెట్లు తీశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.