యాప్నగరం

కోహ్లి దాంపత్య జీవితంపై జ్యోతిష్కుల మాట!

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ ఇటలీలో పెళ్లాడబోతున్నారు. మరి వారి దాంప్యత జీవితం ఎలా ఉంటుందనే విషయాన్ని జ్యోతిష్కులు చెబుతున్నారు.

TNN 11 Dec 2017, 3:05 pm
విరాట్ కోహ్లి, అనుష్క శర్మ ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు చాలా రోజులుగా హల్‌చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ ఇప్పటికే కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లారు. కోహ్లి వివాహం గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. జ్యోతిష్కులు వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేసే పనిలో పడ్డారు. పెళ్లయిన తర్వాత విరాట్, అనుష్క మరిన్ని విజయాలు అందుకుంటారని వారు చెబుతున్నారు.
Samayam Telugu virat kohli anushka sharma to face tough times after marriage astrologers
కోహ్లి దాంపత్య జీవితంపై జ్యోతిష్కుల మాట!


కానీ ఇద్దరూ ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ను సరిగా బ్యాలెన్స్ చేసుకోకపోతే ఇద్దరి మధ్యా విబేధాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కోహ్లి, అనుష్క మధ్య భావోద్వేగపరమైన సంఘర్షణ తలెత్తే అవకాశం ఉంది మాలవ్ భట్ అనే జ్యోతిష్కుడు హెచ్చరిస్తున్నారు. వీరిద్దరి దాంపత్యం సాఫీగా సాగడంపై గ్రహాల సంచారం ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు. వచ్చే రెండేళ్లు ఎంతో కీలకమని ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

పీకల్లోతు ప్రేమలో ఉన్న ఇద్దరి మధ్య ఇప్పటి వరకూ ఎలాంటి ప్రతికూల ఆలోచనలు లేవు. చాలా ఏళ్లుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. విరుష్క అని ఫ్యాన్స్ ముద్దుగా పిలిచే వీరిద్దరూ ఇటలీలోని మిలాన్‌లో డిసెంబర్ 15న పెళ్లాడబోతున్న సమాచారం. వివాహం అనంతరం ముంబైలో కోహ్లి దంపతులు రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.