యాప్నగరం

కోహ్లి 97 రన్స్ వద్ద రవిశాస్త్రితో ఏం చెప్పాడంటే?

కోహ్లి 97 పరుగుల వద్ద ఆడుతున్నాడు. కానీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే లంకను త్వరగా చుట్టేయొచ్చనే ఆలోచనతో..

TNN 21 Nov 2017, 7:31 pm
విరాట్ కోహ్లి వ్యక్తిగత మైలురాళ్ల గురించి పెద్దగా పట్టించుకోడని మరోసారి రుజువైంది. శతకాల అర్ధ శతకం నమోదు చేసే తరుణంలోనూ.. జట్టు ప్రయోజనం కోసం ఆ సెంచరీ చేసే ఛాన్స్‌ను వదులుకోవడానికి కూడా కోహ్లి వెనుకాడలేదు. కోల్‌కతా టెస్టులో 90ల్లో ఉన్నప్పుడు.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం కోసం ప్రయత్నించాడు. 97 రన్స్ వద్ద ఆడుతున్న టైంలో కోహ్లి డ్రెస్సింగ్ రూంలో ఉన్న రవిశాస్త్రి వైపు చూశాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం కోసమే విరాట్ అలా చూడగా.. కోచ్ మాత్రం మరో ఓవర్ ఆడమని సూచించాడు. దీంతో సిక్సర్ బాదిన కోహ్లి కెరీర్లో 50వ సెంచరీని, కోల్‌కతాలో తొలి శతకాన్ని నమోదు చేశాడు.
Samayam Telugu virat kohli batting on 97 asked ravi shastri if he should declare
కోహ్లి 97 రన్స్ వద్ద రవిశాస్త్రితో ఏం చెప్పాడంటే?


అందుకే 50 శతకాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే.. సెంచరీల గురించి ఆలోచించడం కంటే.. బాగా ఆడితేనే నాకు ఎక్కువ సంతోషం కలుగుతుందని కోహ్లి చెప్పాడు. క్రికెట్‌లో కొనసాగినంత కాలం తనకు ఇలాంటి ఆలోచనా విధానమే ఉంటుందని కెప్టెన్ తెలిపాడు.

అంతర్జాతీయ క్రికెట్లో 50 శతకాలు బాదిన విరాట్ కోహ్లిపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీకి ఆకాశమే హద్దు, అతడో అద్భుతమైన ఆటగాడు. విరాట్ 50 సెంచరీలు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నాడు. కోల్‌కతా టెస్టులో ఓవైపు వికెట్లు పడిపోతున్నా.. కోహ్లి అద్భుతంగా ఆడాడు. టెస్టుల్లో 18వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 50వ సెంచరీ సాధించిన 8వ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

బ్రియాన్ లారా (53), మహేల జయవర్దనే (54), హషీమ్ ఆమ్లా (54), జాక్వస్ కలిస్ (62), కుమార సంగక్కర (63), రికీ పాంటింగ్ (71), సచిన్ టెండుల్కర్ (100) మాత్రమే ఇప్పటి వరకూ అంతర్జాతీయ క్రికెట్లో 50కిపైగా సెంచరీలు సాధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.