యాప్నగరం

కెప్టెన్‌గా డివిలియర్స్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డు సాధించాడు.

TNN 22 Jan 2017, 6:39 pm
కెప్టెన్‌గా విరాట్ కోహ్లి మరో రికార్డు సాధించాడు. కెప్టెన్‌గా 17వ వన్డే ఇన్నింగ్స్ ఆడుతున్న కోహ్లి 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అతి తక్కువ వన్డేల్లో వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న కెప్టెన్‌గా విరాట్ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు ఈ రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉండేది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో బాల్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 20 పరుగులు పూర్తి చేసుకోగానే కోహ్లి ఈ ఘనత సాధించాడు. సఫారీ కెప్టెన్‌గా డివిలియర్స్ 18 వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు ఆ ఫీట్‌ను కోహ్లి అధిగమించాడు. 20 వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి 17 ఇన్నింగ్స్‌ల్లో 71.43 యావరేజ్‌తో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో 5 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉండటం గమనార్హం.
Samayam Telugu virat kohli completes 1000 odi runs as captain in just 17 innings breaks ab de villiers record
కెప్టెన్‌గా డివిలియర్స్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి


కోహ్లి, డివిలియర్స్ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కెన్ విలియమ్సన్ ఉన్నాడు. అతడు 20 ఇన్నింగ్స్‌లలో 1000 రన్స్ పూర్తి చేసుకున్నాడు. గంగూలీ 22 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించాడు.

ఈడెన్ గార్డెన్స్ వన్డేలో భారత జట్టు 37 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. రహానే ఒక్క పరుగుకే అవుట్ కాగా.. రాహుల్ 11 పరుగులు చేసి వెనుదిరిగాడు. 11.3 ఓవర్లు పూర్తయ్యే సమయానికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. విరాట్ 35 రన్స్‌తో, యువరాజ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.