యాప్నగరం

రోహిత్‌కి అందుకే ఛాన్సిచ్చాం: కోహ్లి

దక్షిణాఫ్రికాతో సోమవారం ముగిసిన తొలి టెస్టులో రోహిత్ శర్మ‌కి తుది జట్టులో చోటివ్వడంపై విమర్శలు చెలరేగడంతో భారత

TNN 9 Jan 2018, 4:30 pm
దక్షిణాఫ్రికాతో సోమవారం ముగిసిన తొలి టెస్టులో రోహిత్ శర్మ‌కి తుది జట్టులో చోటివ్వడంపై విమర్శలు చెలరేగడంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో మెరుగైన రికార్డు ఉన్న అజింక్య రహానెని తప్పించి రోహిత్ శర్మకి కేప్‌టౌన్ టెస్టులో కోహ్లి అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ టెస్టులో ఘోరంగా విఫలమైన రోహిత్ తొలి ఇన్నింగ్స్‌లో 11, రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగులతో నిరాశపరిచాడు. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో దక్షిణాఫ్రికా 72 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
Samayam Telugu virat kohli defends rohit sharmas selection over ajinkya rahane
రోహిత్‌కి అందుకే ఛాన్సిచ్చాం: కోహ్లి


‘ఇటీవల శ్రీలంకతో ముగిసిన సిరీస్‌‌లో ఫామ్ ఆధారంగా కేప్‌టౌన్ టెస్టుకి తుది జట్టుని ఎంచుకున్నాం. రోహిత్ శర్మ గత మూడు టెస్టుల్లోనూ మెరుగ్గా రాణించాడు. గతంతో పోలిస్తే అతను లంకపై చక్కగా బ్యాటింగ్ చేశాడు. దీంతో అతడ్ని జట్టులో కొనసాగించాం. ఇక్కడ తుది జట్టు ఎంపికలో ఆటగాళ్ల ఫామ్‌ను మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నాం’ అని కోహ్లి వివరించాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో రహానె ఘోరంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్‌కి గాయం కారణంగా హార్దిక్ పాండ్య దూరమవగా.. తాజాగా అతని పునరాగమనంతో జట్టులో పోటీ ఏర్పడి రహానె రిజర్వ్ బెంచ్‌కి పరిమితమయ్యాడు. రెండో టెస్టు సెంచూరియన్ వేదికగా శనివారం నుంచి జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.