యాప్నగరం

కోహ్లి దూకుడుతో సచిన్ ‘నెం.1’ రికార్డ్‌ బ్రేక్..!

భారత కెప్టెన్ విరాట్ కోహ్లి లక్ష్య ఛేదనలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. శ్రీలంకతో దంబుల్లా వేదికగా

TNN 21 Aug 2017, 7:15 pm
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి లక్ష్య ఛేదనలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. శ్రీలంకతో దంబుల్లా వేదికగా జరిగిన తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ (132)తో పాటు కోహ్లి (82) దూకుడుగా ఆడటంతో 217 పరుగుల లక్ష్యాన్ని భారత్ 28.5 ఓవర్లలోనే ఛేదించేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 44వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్న కోహ్లి.. ఛేదనలో వేగవంతంగా 4వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
Samayam Telugu virat kohli goes past sachin tendulkar record
కోహ్లి దూకుడుతో సచిన్ ‘నెం.1’ రికార్డ్‌ బ్రేక్..!


ఇప్పటి వరకు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ 124 ఇన్నింగ్స్‌ల్లో 4 వేల పరుగుల (ఛేదనలో) ఈ మైలురాయిని అందుకుని భారత్ తరఫున అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లి కేవలం 64 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకుని ఆ రికార్డ్‌ని కనుమరుగు చేశాడు. రికీ పాంటింగ్ ఈ మైలురాయిని 104 ఇన్నింగ్స్‌లో అందుకున్నా.. తాజాగా అది కూడా బద్దలైపోవడం విశేషం. అయితే.. ఛేదనలో ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో మాత్రం సచిన్ 5490 పరుగులతో నెం.1గానే కొనసాగుతున్నాడు. అతని తర్వాత రికీ పాంటింగ్ 4186.. ప్రస్తుతం మూడో స్థానంలో కోహ్లి 4001 పరుగులతో కొనసాగుతున్నాడు. శ్రీలంకతో పల్లెకలె వేదికగా
భారత్ గురువారం రెండో వన్డే ఆడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.