యాప్నగరం

టీమిండియా కెప్టెనూ పక్కకి తప్పుకోవాలి

భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లికి కూడా జట్టులో రోటేషన్ విధానం వర్తిస్తుందని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు.

TNN 24 Oct 2017, 12:12 pm
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లికి కూడా జట్టులో రోటేషన్ విధానం వర్తిస్తుందని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ కోసం భారత్ జట్టుని సెలక్టర్లు సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండు టెస్టుల అనంతరం కోహ్లి‌కి సెలక్టర్లు విశ్రాంతినివ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. శ్రీలంకతో జరగనున్న మూడు టెస్టులకీ కోహ్లి ఉంటాడని.. ఆ తర్వాత వన్డే, టీ20 సిరీస్‌ నుంచి విశ్రాంతినివ్వడంపై ఇంకా చర్చించలేదని ఎమ్మెస్కే వివరించారు.
Samayam Telugu virat kohli is available for all three tests against sri lanka msk prasad
టీమిండియా కెప్టెనూ పక్కకి తప్పుకోవాలి


‘శ్రీలంకతో మూడు టెస్టులకి కోహ్లి ఉంటాడా..? లేదా..? అనే విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అతను కచ్చితంగా టెస్టు సిరీస్ మొత్తం ఆడతాడు. ఆ తర్వాత.. కోహ్లికి విశ్రాంతినిచ్చే ఆలోచనలో ఉన్నాం. గత కొన్ని నెలలుగా విరాట్ ఎడతెరపిలేని క్రికెట్ ఆడుతున్నాడు కాబట్టి ప్రస్తుతం అతనికి రెస్ట్ చాలా అవసరం. అందుకే.. జట్టులో అమలు చేస్తున్న రొటేషన్ పాలసీ.. త్వరలో కెప్టెన్‌‌కీ వర్తిస్తుంది’ అని ఎమ్మెస్కే వివరించారు. ఇప్పటికే ఈ పాలసీలో భాగంగా ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, అశ్విన్, జడేజాలకి వన్డే, టీ20ల నుంచి రెస్ట్ ఇచ్చిన సెలక్టర్లు.. శ్రీలంకతో టెస్టు సిరీస్‌ కోసం సోమవారం ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

శ్రీలంకతో పోటీపడే టెస్టు జట్టు: విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌, మురళీ విజయ్‌, శిఖర్ ధావన్‌, పుజారా, అజింక్య రహానె, రోహిత్‌ శర్మ, వృద్ధిమాన్‌ సాహా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య, మహ్మద్ షమి, ఉమేశ్‌ యాదవ్, భువనేశ్వర్‌ కుమార్, ఇషాంత్‌ శర్మ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.