యాప్నగరం

కోహ్లి అరుదైన రికార్డ్.. ఆ ఆరుగురు దిగ్గజాల సరసన కెప్టెన్

ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్ గెలిచి ఉత్సాహం మీదున్న కోహ్లి సేన అదే ఊపులో వన్డే సిరీస్‌లో బరిలో దిగింది.

Samayam Telugu 12 Jul 2018, 5:15 pm
ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్ గెలిచి ఉత్సాహం మీదున్న కోహ్లి సేన అదే ఊపులో వన్డే సిరీస్ బరిలో దిగింది. ట్రెంట్ బ్రిడ్జి వేదికగా ప్రారంభమైన తొలి వన్డేలో టాస్ గెలిచిన విరాట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం నుంచి కోలుకోపోవడంతో.. భువీ మ్యాచ్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో సిద్దార్థ్ కౌల్ భారత్ తరఫున వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో సురేష్ రైనా‌కు కూడా అవకాశం కల్పించారు. 2015 అక్టోబర్ తర్వాత రైనా ఆడుతున్న తొలి వన్డే ఇదే కావడం గమనార్హం.
Samayam Telugu KOHLI VS ENG


టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి ఇది 50 వన్డే కావడం విశేషం. 50 వన్డేల్లో కెప్టెన్‌గా భారత్‌కు నాయకత్వం వహించిన ఏడో ఆటగాడు కోహ్లి. ఇప్పటి వరకూ ధోనీ, అజహర్, గంగూలీ, ద్రావిడ్, కపిల్, సచిన్ టెండుల్కర్ మాత్రమే 50కిపైగా వన్డేల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. కోహ్లి సారథ్యంలో భారత జట్టు ఇప్పటి వరకూ 49 వన్డేలు ఆడగా.. 38 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. క్లైవ్ లాయిడ్, రికీ పాంటింగ్‌లతో సమానం కోహ్లి విజయాలు సాధించడం విశేషం.

మ్యాచ్ విషయానికి వస్తే.. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కి ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో అవకాశం కల్పించింది. అలెక్స్ హేల్స్ స్థానంలో అతడికి అవకాశం కల్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.