యాప్నగరం

కింగ్ కోహ్లి.. ఒకే మ్యాచ్‌లో రెండు శతకాలు!

సఫారీ గడ్డపై కోహ్లి అరుదైన రికార్డ నెలకొల్పాడు. వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికాలో మూడు సెంచరీలు తొలి భారత ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు.

TNN 16 Feb 2018, 10:54 pm
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పరుగుల దాహం తీరడం లేదు. సఫారీ గడ్డపై 43 రోజుల్లోనే 800పైకి పరుగులు పిండుకున్న కోహ్లి.. ఆఖరి వన్డేలో సెంచరీతో చెలరేగాడు. ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన కోహ్లి.. ఈ సిరీస్‌లో మూడో శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. వన్డేలో కోహ్లికి ఇది 35వ సెంచరీ కాగా.. ఈ టూర్లో దక్షిణాఫ్రికాపై నాలుగో శతకం కావడం విశేషం. ఛేజింగ్‌లో విరాట్‌కు ఇది 21వ సెంచరీ కావడం గమనార్హం.
Samayam Telugu virat kohli is the first indian to score three centuries in a series in south africa
కింగ్ కోహ్లి.. ఒకే మ్యాచ్‌లో రెండు శతకాలు!


ఈ మ్యాచ్‌లో ఏకంగా 17 ఫోర్లు బాదిన కోహ్లి వేగంగా ఆడి 82 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లోనే మూడు శతకాలు బాదిన కోహ్లి.. సఫారీ గడ్డ మీద అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా కెవిన్ పీటర్సన్ రికార్డును సమం చేశాడు.

2003 వరల్డ్ కప్‌లో గంగూలీ సౌతాఫ్రికా గడ్డపై మూడు సెంచరీలు బాదగా.. మరుసటి ఏడాది ఆస్ట్రేలియాలో వీవీఎస్ లక్ష్మణ్ మూడు శతకాలు సాధించాడు. సఫారీ గడ్డ మీద ద్వైపాక్షి సిరీస్‌లో మూడు శతకాలు బాదిన తొలి భారత బ్యాట్స్‌మెన్ కోహ్లినే.

ఫీల్డర్‌గానూ కోహ్లి ఖాతాలో మరో రికార్డ్ చేరింది. వన్డేల్లో 100వ క్యాచ్‌ను అందుకున్న ఆరో భారత ఆటగాడిగా విరాట్ అరుదైన ఘనత సాధించాడు. బ్యాట్‌తోపాటు, ఫీల్డ్‌లోనూ కోహ్లి సెంచరీ కొట్టాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.