యాప్నగరం

ఐసీసీ అవార్డులు: ధోనీ సరసన కోహ్లి

ఐసీసీ వన్డే, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన విరాట్ కోహ్లి.. ధోనీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు.

TNN 18 Jan 2018, 12:10 pm
గత ఏడాది అద్భుతమైన ఆటతీరుతోపాటు కెప్టెన్‌గా భారత జట్టుకు తిరుగులేని విజయాలను అందించిన విరాట్ కోహ్లి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2017గా ఎంపికయ్యాడు. వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌తోపాటు ఐసీసీ వన్డే, టెస్ట్ కెప్టెన్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డులను కోహ్లి ఎంపికయ్యాడు. తద్వారా అరుదైన రికార్డులను కోహ్లి సొంతం చేసుకున్నాడు. ఒకే ఏడాది ఐసీసీ వన్డే, టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన రెండో భారత కెప్టెన్‌గా కోహ్లి ఘనత వహించాడు. 2009లో ధోనీ మాత్రమే ఈ రెండు అవార్డులను సొంతం చేసుకున్నాడు.
Samayam Telugu virat kohli is the thrid captain to win icc test and odi captain for the same year
ఐసీసీ అవార్డులు: ధోనీ సరసన కోహ్లి


ఓవరాల్‌గా ముగ్గురు కెప్టెన్లు మాత్రమే ఒకే ఏడాదిలో టెస్టు, వన్డే కెప్టెన్‌గా ఎంపికయ్యారు. 2004, 2007 ఏడాదిల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ ఫీట్ సాధించాడు. అతడి తర్వాత ఈ ఘనత సాధించింది ధోనీ, కోహ్లి మాత్రమే.

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన విరాట్ కోహ్లి.. సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని అందుకోనున్నాడు. ఈ అవార్డుకు ఎంపికైన నాలుగో భారత క్రికెటర్ విరాట్ కావడం గమనార్హం. 2004లో రాహుల్ ద్రావిడ్, 2010లో సచిన్ టెండుల్కర్, 2016లో రవిచంద్రన్ అశ్విన్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.