యాప్నగరం

​ కొత్త స్టైల్.. కోహ్లి-రాహుల్ ‘డాబ్’ సంబరాలు

బంతిని క్యాచ్‌గా అందుకోలేకపోయిన రాహుల్.. చాకచక్యంగా వ్యవహరించి బంతిని అలానే శరీరంపై

TNN 5 Aug 2017, 3:30 pm
భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. తొలిరోజు నుంచి భారత్ జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తుండగా.. లంకేయులు మాత్రం రక్షణాత్మక ఆటకే పరిమితమవుతున్నారు. దాదాపు నాలుగు నెలలు తర్వాత మళ్లీ టెస్టుల్లోకి పునారాగమనం చేసిన ఓపెనర్ కేఎల్ రాహుల్ బ్యాట్‌తో అర్ధశతకానికే పరిమితమైనా.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టేస్తున్నాడు.
Samayam Telugu virat kohli kl rahul do the dab to celebrate
​ కొత్త స్టైల్.. కోహ్లి-రాహుల్ ‘డాబ్’ సంబరాలు


శ్రీలంక తొలి ఇన్నింగ్స్ సమయంలో.. ఓపెనర్ ఉపుల్ తరంగ బలహీనతని పసిగట్టిన కెప్టెన్ కోహ్లి.. స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌తో ఒక వ్యూహాన్ని రచించాడు. ఇందులో భాగంగానే షార్ట్‌ ఫైన్‌లెగ్‌లో కేఎల్ రాహుల్‌ని ఫీల్డర్‌గా ఉంచాడు. లెగ్ వికెట్‌కి దూరంగా వైడ్ రూపంలో అశ్విన్ బంతి విసరగా.. దాన్ని లెగ్ గల్లీ దిశగా తరలించేందుకు ఉపుల్ తరంగ ప్రయత్నించాడు. అయితే.. బంతి బ్యాట్‌ని తాకి నేరుగా రాహుల్ శరీరంపైకి దూసుకొచ్చింది. కానీ.. బంతిని క్యాచ్‌గా అందుకోలేకపోయిన రాహుల్.. చాకచక్యంగా వ్యవహరించి బంతిని అలానే శరీరంపై అదిమిపట్టుకున్నాడు.

pic.twitter.com/IfF8ZkykjT — Cricvids (@Cricvids1) August 4, 2017
నమ్మశక్యంకానీ ఈ క్యాచ్‌కి నివ్వెరపోయిన తరంగ.. నిరాశగా పెవిలియన్ బాట పట్టగా.. సంతోషంతో కేఎల్ రాహుల్ మైదానంలో తిరుగుతూ సంబరాలు చేసుకున్నాడు. ఈ సమయంలోనే.. ఫుట్‌బాల్ క్రీడాకారుల తరహాలో.. రాహుల్, కోహ్లి డాబ్ స్టైల్ సంబరాలు చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Upul Thranga hit an Ashwin delivery straight at KL Rahul — who was fielding at short leg — and somehow the ball stuck in his body and he was able to get hold of it. Skipper Kohli celebrated the first scalp of the innings by doing the 'dab' with Rahul.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.