యాప్నగరం

కోహ్లీపై ఇక విమర్శలు చాలించండి: ఆనంద్

కోహ్లీ ఆ అభిమాని కామెంట్ చూసి సహనాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత భావోద్వేగంలో తనకి స్ఫురించిన మొదటి మాట (దేశం విడిచి వెళ్లు) అనేశాడు.

Samayam Telugu 13 Nov 2018, 2:02 pm
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్చ కొనసాగుతూనే ఉంది. గత వారం.. భారత క్రికెటర్ల కంటే ఆట కంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్ల ఆటనే తాను ఎక్కువగా ఆస్వాదిస్తానని ఓ అభిమాని కామెంట్ చేయడంపై స్పందించిన కోహ్లీ.. ‘నువ్వు ఇండియా విడిచి వెళ్లు’ అంటూ అతనికి సమాధానమిచ్చాడు. దీంతో.. సోషల్ మీడియాలో అభిమానులు పెత్త ఎత్తున కోహ్లీపై విమర్శలు గుప్పించగా.. కొంత మంది మాజీ క్రికెటర్లు సైతం కోహ్లీ స్పందించిన తీరుపై తప్పుబట్టారు తాజాగా చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈ వివాదంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Samayam Telugu virat kohli lost control while making leave india comment reckons viswanathan anand
కోహ్లీపై ఇక విమర్శలు చాలించండి: ఆనంద్


‘కోహ్లీ ఆ అభిమాని కామెంట్ చూసి సహనాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత భావోద్వేగంలో తనకి స్ఫురించిన మొదటి మాట (దేశం విడిచి వెళ్లు) అనేశాడు. క్రీడల్లో ఆ దూకుడు శైలి బాగా నప్పుతుంది. ఇంకా చెప్పాలంటే.. ఆ స్వభావమే అతడ్ని అత్యుత్తమ ఆటగాడిగా నిలబెట్టింది. వాస్తవానికి మనుషులందరికీ భావోద్వేగాలు ఉంటాయి. కొన్నిసార్లు అవి అదుపు తప్పడం సహజం. ఇప్పటికే కోహ్లీ తాను చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక ఈ వివాదాన్ని విడిచిపెట్టండి’ అని ఆనంద్ సూచించారు.

భారత్ జట్టు ఈనెల 21 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనుంది. అక్కడ మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్‌‌ని ఆడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.