యాప్నగరం

విరాట్ కోహ్లి మరో 25 రన్స్ చేసి ఉంటే..?

నాగ్‌పూర్ టెస్టులో కోహ్లి మరో 25 పరుగులు పూర్తి చేసి ఉంటే.. అరుదైన ఘనత అతడి ఖాతాలో చేరేది..

TNN 29 Nov 2017, 2:37 pm
నాగ్‌పూర్ టెస్టులో డబుల్ సెంచరీ బాదిన కోహ్లి రికార్డుల మోత మోగించాడు. కెప్టెన్‌గా ఐదు ద్విశతకాలు బాది వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా రికార్డును సమం చేశాడు. భారత్ తరఫున ఇది 50వ ద్విశతకం కావడం గమనార్హం. డబుల్‌కు ముందే.. కెప్టెన్‌గా ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగానూ విరాట్ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది టీమిండియా కెప్టెన్ పది సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఒకే ఏడాది 9 శతకాలు సాధించిన రికీ పాంటింగ్ రికార్డును బద్దలుకొట్టాడు.
Samayam Telugu virat kohli missed the chance to score 5000 runs in 104 innings to equal lara record
విరాట్ కోహ్లి మరో 25 రన్స్ చేసి ఉంటే..?


267 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 17 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 213 రన్స్ చేశాడు. డబుల్ సెంచరీ పూర్తయ్యాక భారీ షాట్‌‌కు యత్నించిన కోహ్లి.. పెరెరా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి తిరిమాన్నెకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఇప్పటి వరకూ టెస్టుల్లో 104 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. 19 సెంచరీలు, 5 డబుల్ సెంచరీల సాయంతో 4975 పరుగులు పూర్తి చేశాడు. నాగ్‌పూర్‌లో మరో 25 పరుగులు చేసి ఉంటే కోహ్లి ఖాతాలో 5 వేల పరుగులు చేరేవి. తద్వారా 104 ఇన్నింగ్స్‌ల్లో 5 వేల పరుగులు పూర్తి చేసిన లారా రికార్డును విరాట్ సమం చేసి ఉండేవాడు. భారత్ తరఫున గావస్కర్ 95 ఇన్నింగ్స్‌ల్లో, సెహ్వాగ్ 99, సచిన్ 103 ఇన్నింగ్స్‌ల్లో 5 వేల పరుగులు పూర్తి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.