యాప్నగరం

సెంచరీ జస్ట్ మిస్.. కానీ కోహ్లి ఖాతాలో అరుదైన రికార్డ్

ట్రెంట్ బ్రిడ్జిలో శతకం సాధించే అవకాశాన్ని విరాట్ కొద్దిలో కోల్పోయాడు. కానీ మరో రికార్డును మాత్రం ఖాతాలో వేసుకున్నాడు.

Samayam Telugu 19 Aug 2018, 2:07 pm
ట్రెంట్ బ్రిడ్జి టెస్టులో తొలి రోజు అద్భుతంగా ఆడిన కోహ్లి మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 152 బంతుల్లో 97 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్న విరాట్‌.. అదిల్ రషీద్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టెస్టు కెరీర్లో కోహ్లి 90ల్లో అవుటవడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. 2013లో దక్షిణాఫ్రికాపై 96 పరుగుల వద్ద విరాట్ అవుటయ్యాడు.
Samayam Telugu virat batting


శనివారానికి కోహ్లి క్రికెట్లోకి అడుగుపెట్టి పదేళ్లు. అదే రోజు శతకం సాధించే అవకాశాన్ని విరాట్ కొద్దిలో కోల్పోయాడు. కానీ మరో రికార్డును మాత్రం ఖాతాలో వేసుకున్నాడు. విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. గంగూలీ 43 ఇన్నింగ్స్‌ల్లో 1693 పరుగులు చేయగా.. ఆ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు.

కెప్టెన్‌గా కోహ్లి విదేశాల్లో 30 ఇన్నింగ్స్‌ ఆడగా.. 59.68 సగటుతో 1731 పరుగులు చేశాడు. భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా మారిన విరాట్.. ఎడ్జ్ బాస్టన్ టెస్టులో 200 (149, 51) పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.