యాప్నగరం

ఆస్ట్రేలియా టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంపిక

టెస్టుల్లో రికార్డుల మోత మోగిస్తూ.. ఏకంగా ఏడు డబుల్ సెంచరీలు నమోదు చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని క్రికెట్ ఆస్ట్రేలియా తమ దశాబ్దపు జట్టు కెప్టెన్‌గా నియమించింది. భారత్ నుంచి ఈ జట్టులో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్ కోహ్లీనే.

Samayam Telugu 24 Dec 2019, 2:47 pm
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. టెస్టుల్లో గత దశాబ్దకాలంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తాజాగా ఓ జట్టుని ప్రకటించింది. అందులో భారత్ నుంచి కేవలం విరాట్ కోహ్లీకి మాత్రమే అవకాశం దక్కింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? ఈ టీమ్‌ కెప్టెన్సీ బాధ్యతల్ని కూడా కోహ్లీకే సీఏ అప్పగించింది.
Samayam Telugu Ranchi: Indian cricket captain Virat Kohli celebrates after winning the Test ser...


Read More: గంగూలీ ఐపీఎల్ టీమ్‌లో ధోనీకి దక్కని చోటు.. కీపర్‌గా ఎవరంటే..?
సీఏ దశాబ్దపు టెస్టు జట్టు: అలిస్టర్ కుక్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, స్టీవ్‌స్మిత్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, బెన్‌స్టోక్స్, డేల్ స్టెయిన్, స్టువర్ట్ బ్రాడ్, నాథన్ లయన్, జేమ్స్ అండర్సన్

ఓపెనర్లుగా అలిస్టర్ కుక్, డేవిడ్ వార్నర్‌లకి అవకాశం దక్కగా.. మూడో స్థానంలో విలియమ్సన్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ, స్టీవ్‌స్మిత్, ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. ఇక బెన్‌స్టోక్స్‌ని ఆల్‌రౌండర్ కోటాలో ఎంపిక చేసిన సీఏ.. స్టెయిన్, బ్రాడ్, అండర్సన్ రూపంలో ముగ్గురు ప్రొఫెషనల్ ఫాస్ట్ బౌలర్లకి చోటిచ్చింది. కానీ.. అనూహ్యంగా లయన్ రూపంలో ఒక స్పిన్నర్‌కే చోటు దక్కగా.. వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారో..? ప్రకటించలేదు. బహుశా ఏబీ డివిలియర్స్‌కి ఆ బాధ్యతలు అప్పగించాలని సీఏ భావించినట్లుంది. డికాక్‌ టీమ్‌లోకి రాక ముందు దక్షిణాఫ్రికా టీమ్ వికెట్ కీపర్‌గా డివిలియర్స్ కొన్ని మ్యాచ్‌లు ఆడాడు.

Read More: శ్రీలంక, ఆస్ట్రేలియాతో సిరీస్‌ కోసం భారత్ జట్టు ప్రకటన.. బుమ్రా, ధావన్ రీఎంట్రీ

బాల్ టాంపరింగ్ కారణంగా ఒక ఏడాది నిషేధానికి గురైనప్పటికీ డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్‌లకి సీఏ చోటిచ్చింది. ఇక వన్డే, టీ20ల్లో రెచ్చిపోయే ఏబీ డివిలియర్స్ టెస్టుల్లో అంచనాల్ని అందుకోలేకపోయాడు. అయినప్పటికీ.. అతనికి చోటు దక్కగా.. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ని సీఏ పక్కన పెట్టడం భారత అభిమానులకి కోపం తెప్పిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.