యాప్నగరం

విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ.. లారా రికార్డ్ సమం!

నాగ్‌‌పూర్ టెస్టులో విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ సాధించాడు. తద్వారా అత్యధిక ద్విశతకాలు బాదిన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు.

TNN 26 Nov 2017, 3:26 pm
టీమిడింయా కెప్టెన్ విరాట్ కోహ్లి నాగ్‌పూర్ టెస్టులో డబుల్ సెంచరీ సాధించాడు. శ్రీలంక బౌలర్లను ఊచకోత కోసిన కోహ్లి.. 267 బంతుల్లో 213 పరుగులు చేసి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లికి టెస్టుల్లో ఇది ఐదో డబుల్ సెంచరీ కావడం గమనార్హం. ఇప్పటి వరకూ బ్రియాన్ లారా మాత్రమే కెప్టెన్‌గా ఐదు డబుల్ సెంచరీలు సాధించగా.. తాజా ద్విశతకంతో కోహ్లి విండీస్ దిగ్గజం సరసన చేరాడు. గత ఏడాది మూడు ద్విశతకాలు సాధించిన కోహ్లి.. ఈ ఏడాది రెండో డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఫిబ్రవరిలో హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో కోహ్లి ద్విశతకం సాధించిన సంగతి తెలిసిందే.
Samayam Telugu virat kohli smashes his 5th double ton
విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ.. లారా రికార్డ్ సమం!


శ్రీలంకపై డబుల్ సెంచరీ సాధించడం ద్వారా భారత్ తరఫున అత్యధిక డబుల సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ రెండోస్థానానికి చేరుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండుల్కర్ ఆరు ద్విశతకాల చొప్పున సాధించగా.. రాహుల్ ద్రవిడ్ ఐదు డబుల్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. 2000లో సరిగ్గా ఇదే రోజు నాగ్‌పూర్‌లో సచిన్ డబుల్ సెంచరీ సాధించడం గమనార్హం.

నాగ్‌పూర్ టెస్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఐదో వికెట్‌కు 150+ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ 169 ఓవర్లలో 578 పరుగులు చేసింది. (ఇంకా కొనసాగుతోంది) ఈ స్టేడియంలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. 2010లో న్యూజిలాండ్‌పై ధోనీ సేన చేసిన 566/8 రికార్డును కోహ్లి సేన బద్దలుకొట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.