యాప్నగరం

రెస్ట్ కావాలంటే.. కోహ్లిని తప్పిస్తాం..!

భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లికీ విశ్రాంతి కావాలంటే.. తీసుకోవచ్చని బీసీసీఐ అధికారి ఒకరు సూచించారు. మార్చి 6 నుంచి 18

TNN 22 Feb 2018, 2:14 pm
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లికీ విశ్రాంతి కావాలంటే.. తీసుకోవచ్చని బీసీసీఐ అధికారి ఒకరు సూచించారు. మార్చి 6 నుంచి 18 వరకు శ్రీలంకలో భారత్ జట్టు ముక్కోణపు టీ20 సిరీస్ ఆడనుంది. ఇందులో భారత్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఆడనున్నాయి. భారత సెలక్టర్లు ఈ సిరీస్‌ కోసం జట్టుని ఈ వారం చివర్లో ప్రకటించనుండగా.. కొద్ది మంది సీనియర్ క్రికెటర్లు తమకి విశ్రాంతి కావాలని బీసీసీఐకి విన్నవించారట. ఈ జాబితాలో ప్రస్తుతానికి విరాట్ కోహ్లి లేనప్పటికీ.. అతను అడిగితే విశ్రాంతి ఇచ్చేందుకు బీసీసీఐకి ఎలాంటి అభ్యంతరంలేదని సదరు అధికారి వెల్లడించారు.
Samayam Telugu virat kohli wants to rest for tri nation series
రెస్ట్ కావాలంటే.. కోహ్లిని తప్పిస్తాం..!


‘ముక్కోణపు సిరీస్‌ నుంచి విశ్రాంతి కావాలనుకుంటే విరాట్ కోహ్లి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. కానీ.. ఎవరు మాత్రం ఊహించగలరు కోహ్లికి రెస్ట్ కావాలో..? వద్దో..? ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ ప్రారంభంకానుంది. ఆ టోర్నీకి ముందు ఫామ్‌ని నిలబెట్టుకునేందుకు ఈ ముక్కోణపు సిరీస్‌ కోహ్లికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి.. అతను ఈ ఛాన్స్‌ని మిస్ చేసుకుంటాడని అనుకోను. ఒకవేళ అతను రెస్ట్ కావాలంటే మాత్రం.. జట్టు నుంచి తప్పించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది’ అని అధికారి వెల్లడించారు. గత ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆడుతూ గాయపడిన కోహ్లి.. కొద్దిరోజులు మాత్రమే ఆట నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం గత ఏడాది చివర్లో వివాహం సందర్భంగా శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ నుంచి ఈ కెప్టెన్ పక్కకి తప్పుకున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.