యాప్నగరం

కోహ్లి జీవితాన్ని మార్చిన పుస్తకం!

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వరుస విజయాలతో తిరుగులేని సారథిగా దూసుకుపోతున్నాడు. కోహ్లి పాటిస్తున్న కొన్ని కచ్చితమైన నిర్ణయాలే అతన్ని ఇప్పుడు స్థిరమైన, బలమైన క్రికెటర్‌గా నిలబెట్టాయి.

TNN 18 Feb 2017, 8:26 pm
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వరుస విజయాలతో తిరుగులేని సారథిగా దూసుకుపోతున్నాడు. కోహ్లి పాటిస్తున్న కొన్ని కచ్చితమైన నిర్ణయాలే అతన్ని ఇప్పుడు స్థిరమైన, బలమైన క్రికెటర్‌గా నిలబెట్టాయి. అతని బ్యాటింగ్, కెప్టెన్సీ, హెల్తీ లైఫ్‌స్టైల్ అన్నీ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. కోహ్లి అతని సహచరులకే కాదు.. రాబోయే యువతరానికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Samayam Telugu virat kohli wants you to read this book that has changed his life
కోహ్లి జీవితాన్ని మార్చిన పుస్తకం!


అయితే కోహ్లీ ఇంత దృఢంగా, స్థిరంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. ఒక పుస్తకం. ఈ 28 ఏళ్ల క్రికెటర్‌కి జీవితం అంటే ఏంటో నేర్పింది ఆ పుస్తకమేనట. ఇంతకీ ఆ పుస్తకం ఏదో తెలుసా.. ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి’ (ఓ యోగి ఆత్మకథ). ఈ పుస్తకం పట్టుకుని ఉన్న ఫొటోను కోహ్లి శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. అంతేకాకుండా ‘ఈ పుస్తకాన్ని మీరందరూ చదవండి, కచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తుంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.

‘ఈ పుస్తకం అంటే నాకు చాలా ఇష్టం. తమ ఆలోచనలు, సిద్ధాంతాలను అమలుచేయలేని వారు కచ్చితంగా చదవాల్సిన పుస్తకం ఇది. ఈ పుస్తకం అందించే నాలెడ్జ్‌ను అర్థం చేసుకుని ఆచరణలో పెడితే మీ జీవితం మారిపోతుంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు .

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.