యాప్నగరం

కోహ్లి ఇప్పుడు చూపించు నీ సత్తా..!

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి కఠిన పరీక్షలు తప్పవని మాజీ స్పిన్నర్ బిషన్‌సింగ్ బేడీ వ్యాఖ్యానించారు. జనవరి 5 నుంచి

TNN 30 Dec 2017, 4:15 pm
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి కఠిన పరీక్షలు తప్పవని భారత మాజీ స్పిన్నర్ బిషన్‌సింగ్ బేడీ వ్యాఖ్యానించారు. జనవరి 5 నుంచి సఫారీ గడ్డపై టీమిండియా మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకి చేరుకున్న భారత్ జట్టు.. అక్కడి పరిస్థితులకి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల అనుష్క శర్మని వివాహం చేసుకున్న విరాట్ కోహ్లి.. శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో జట్టులోకి పునరాగమనంలో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడోనని అందరిలో ఆసక్తి నెలకొంది.
Samayam Telugu virat kohli will face real challenge in south africa bishen singh bedi
కోహ్లి ఇప్పుడు చూపించు నీ సత్తా..!


‘భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు గత కొన్నేళ్లుగా.. చాలా ఘనతలు సాధించింది. కానీ.. విరాట్ కోహ్లి ఇంకా నిరూపించుకునే దశలో ఉన్నాడు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే.. పీవీ సింధు ఇప్పటికే ప్రపంచంలోని అత్యుత్తమ ప్రత్యర్థులను ఢీకొని సత్తా చాటింది. అయితే.. విరాట్ కోహ్లి మాత్రం ఇప్పుడే అగ్రజట్లలో ఒకటైన దక్షిణాఫ్రికాని దాని సొంతగడ్డపై ఢీకొననున్నాడు. ఈ దక్షిణాఫ్రికా పర్యటన విరాట్ కోహ్లికి కచ్చితంగా కఠిన పరీక్షే’ అని బిషన్‌సింగ్ బేడీ వెల్లడించారు. సఫారీ గడ్డపై విరాట్ కోహ్లి ఇప్పటి వరకు కేవలం ఒక టెస్టు మాత్రమే ఆడాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.