యాప్నగరం

కోహ్లి, అశ్విన్‌లను లెజెండ్‌‌లుగా అభివర్ణించిన ద్రవిడ్

భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, స్పిన్నర్ అశ్విన్‌లపై రాహుల్ ద్రవిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లిని లెజెండ్‌గా అభివర్ణించిన ద్రవిడ్..

TNN 2 Dec 2016, 3:48 pm
భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, స్పిన్నర్ అశ్విన్‌లపై రాహుల్ ద్రవిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లిని లెజెండ్‌గా అభివర్ణించిన ద్రవిడ్.. ఆల్‌రౌండర్ అశ్విన్ కూడా ఆధునిక కాలంలో ఓ లెజెండేనంటూ కితాబిచ్చాడు. గత 40 టెస్టు మ్యాచ్‌ల్లో అశ్విన్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే క్రికెట్ చరిత్రలోనే అతడో గొప్ప క్రీడాకారుడంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజ క్రికెటర్లు ఆటకు దూరమైనప్పటికీ భారత క్రికెట్లో ఇప్పటికీ లెజెండ్లు ఉన్నారంటూ కోహ్లి, అశ్విన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు.
Samayam Telugu virat koli and r ashwin are legends of modern era dravid
కోహ్లి, అశ్విన్‌లను లెజెండ్‌‌లుగా అభివర్ణించిన ద్రవిడ్


టెస్టుల్లో 13 వేల పరుగులు, వన్డేల్లో పది వేలకు పైగా పరుగులు పూర్తి చేసిన రాహుల్.. అండర్ 19 క్రికెట్ జట్టు కోచ్‌గా, రాజస్థాన్ రాయల్స్ జట్టు కోచ్‌గా క్రికెట్‌కు సేవలందిస్తున్నాడు. భావి క్రికెటర్లను తయారుచేసే బృహత్తర కార్యాన్ని ద్రవిడ్ తన భుజాలపైకి ఎత్తుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.