యాప్నగరం

కోచ్ ఇంటర్వ్యూ గురించి సెహ్వాగ్‌ని అడిగితే..?

ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి..? అసలు ఏం జరిగింది..? అని సెహ్వాగ్‌ని మీడియా ప్రశ్నించగా

TNN 18 Jul 2017, 7:50 pm
భారత్ జట్టు ప్రధాన కోచ్ పదవిని ఆశిస్తూ ఇంటర్వ్యూకి హాజరైన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కి నిరాశే ఎదురైంది. తీవ్ర తర్జనభర్జనల మధ్య రవిశాస్త్రిని ప్రధాన కోచ్‌గా నియమిస్తూ బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంది. ఇంటర్వ్యూలు నిర్వహించిన సచిన్ తెందుల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్ సలహా కమిటీ సభ్యులు సెహ్వాగ్‌కి ఒకప్పటి సహచరులైనా.. ఈ మాజీ ఓపెనర్‌ని ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. కనీసం బ్యాటింగ్ కోచ్‌గానైనా.. సెహ్వాగ్‌ని ఎంచుకుంటారని అంతా భావించారు.
Samayam Telugu virender sehwag avoids questions over india coach snub
కోచ్ ఇంటర్వ్యూ గురించి సెహ్వాగ్‌ని అడిగితే..?


ప్రధాన కోచ్ కోసం 10 మంది దరఖాస్తు చేసుకోగా.. చివరికి ఆరు మందిని కమిటీ ఇంటర్వ్యూకి పిలిచింది. ఈ ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి..? అసలు ఏం జరిగింది..? అని సెహ్వాగ్‌ని మీడియా ప్రశ్నించగా ‘మీరు అమీద్ ఇండియా గురించి అడగండి.. సమాధానం చెప్తాను’ అని తనదైన శైలిలో ఈ ఓపెనర్ బదులిచ్చాడు. అమీద్ ఇండియా సెహ్వాగ్ ప్రచారం చేస్తున్న ఒక షో. కోచ్ ఎంపికకి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడగొద్దని.. దానికి ఇప్పుడు తాను సమాధానం చెప్పలేనని సెహ్వాగ్ బాధపడ్డాడట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.