యాప్నగరం

ఇషాంత్‌‌కి సెహ్వాగ్‌ ‘యురేకా’ స్టైల్ విషెష్..!

భారత డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చమత్కార శైలి గురించి పరిచయం అక్కర్లేదేమో..

TNN 2 Sep 2017, 8:22 pm
భారత డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చమత్కార శైలి గురించి పరిచయం అక్కర్లేదేమో..!. ప్రముఖుల పుట్టిన రోజుల సందర్భంగా అతను చెప్పే విషెష్‌‌ని సోషల్ మీడియాలో అభిమానులు ప్రత్యేకంగా వెతుకుతుంటారు. తాజాగా శనివారం పుట్టిన రోజు జరుపుకుంటున్న భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మకి సెహ్వాగ్ చెప్పిన బర్త్‌డే విషెష్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌ని కవ్విస్తూ ఇషాంత్ శర్మ ముఖంలో చూపిన హావభావాలు అప్పట్లో అభిమానులకి విపరీతంగా నవ్వు తెప్పించాయి. ఇంకా చెప్పాలంటే.. కొద్దిరోజుల పాటు అదో ట్రెండ్‌గా మారిపోయింది.
Samayam Telugu virender sehwag hilariously trolls ishant sharma on his birthday
ఇషాంత్‌‌కి సెహ్వాగ్‌ ‘యురేకా’ స్టైల్ విషెష్..!


తాజాగా ఆ ఫోటోకి శతాబ్దం నాటి మరో ఫొటోని జతచేస్తూ ఇషాంత్‌కి సెహ్వాగ్ విషెష్ చెప్పాడు. ‘హ్యాపీ బర్త్ డే బూర్జ్ ఖలీఫా జీ.. నీకు శిక్షణ ఇచ్చిన వారిని కనిపెట్టశా. ఇలాగే అందర్నీ ఆనందింపజేస్తూ.. కలకాలం సంతోషంగా ఉండు’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ప్రపంచంలోనే ఎత్తైన భవనం బూర్జ్ ఖలీఫా‌తో ఇషాంత్‌ని పోలుస్తూ.. 1840 కాలం నాటి విక్టోరియన్ మహిళ ఫొటో స్టిల్‌ని సేకరించి సెహ్వాగ్ పోస్ట్ చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.