యాప్నగరం

చాహల్, కుల్దీప్‌కి ఆసియా కప్ ఓ ఛాలెంజ్

టోర్నీలో భాగంగా హాంకాంగ్‌తో మంగళవారం తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా.. ఆ తర్వాత రోజే అంటే బుధవారం తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది.

Samayam Telugu 14 Sep 2018, 3:35 pm
యూఏఈ వేదికగా శనివారం నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్‌‌లో వికెట్లు పడగొట్టడం భారత మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్‌కి ఓ ఛాలెంజ్‌ అని‌ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. టోర్నీలో భాగంగా హాంకాంగ్‌తో మంగళవారం తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా.. ఆ తర్వాత రోజే అంటే బుధవారం తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది. యూఏఈ పిచ్‌లు ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లకే ఎక్కువగా సహకరిస్తాయని వెల్లడించిన సెహ్వాగ్.. టోర్నీలో స్పిన్నర్ల ప్రదర్శనపైనే మ్యాచ్ ఫలితాలు ఆధారపడి ఉంటాయని వివరించాడు.
Samayam Telugu Nottingham :Indias Kuldeep Yadav, center right, acknowledges the crowd at the e...
India's Kuldeep Yadav, center right, acknowledges the crowd at the end of the England innings during the One Day International Series cricket match between England and India at Trent Bridge, Nottingham, England.Photo


‘కుల్దీప్, చాహల్ గత ఏడాదికాలంగా మెరుగ్గా రాణిస్తున్నారు. కానీ.. ఆసియా కప్‌లో వారికి గట్టి సవాల్ ఎదురుకానుంది. ఎందుకంటే.. టోర్నీలో పోటీపడుతున్న ప్రధాన జట్లలోని బ్యాట్స్‌మెన్స్ అందరికీ స్పిన్ ఆడటంలో అనుభవం ఉంటుంది. కాబట్టి.. వారిని బోల్తా కొట్టించడం అంత సులువు కాదు. దీనికి తోడు యూఏఈ పిచ్‌ల నుంచి ఫాస్ట్ బౌలర్లకి ఆశించినంతం సహకారం లభించదు. ఆ సమయంలో స్పిన్నర్ల ప్రదర్శనే కీలకంకానుంది. దీంతో చిన్నప్పటి నుంచి స్పిన్ ఆడటాన్ని అలవాటు చేసుకున్న ఉపఖండం బ్యాట్స్‌మెన్స్‌‌‌‌ని ఔట్ చేయడానికి వారు శ్రమించాల్సిందే’ అని సెహ్వాగ్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.