యాప్నగరం

షమీని ఇప్పటికీ ప్రేమిస్తున్నా, తనను కలవాలి

షమీ నా భర్త. అతణ్ని ఇప్పటికీ ప్రేమిస్తున్నా.. తనను కలవాలని ఉంది. కానీ తనేమో నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.

Samayam Telugu 27 Mar 2018, 9:34 am
టీమిండియ క్రికెటర్ మహ్మద్ షమీకి వేరే అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని అతడి భార్య హసీన్ జహాన్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. షమీపై కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈ మధ్యే బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా కలిశారు. శనివారం డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా... షమీ కారు లారీని ఢీకొట్టడంతో అతడి తలకు గాయమైంది. కుట్లు వేసిన డాక్టర్లు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
Samayam Telugu భార్యతో షమీ


షమీకి యాక్సిడెంట్ కావడంతో.. అతణ్ని కలవాలని అనుకుంటున్నట్లు జహాన్ చెప్పింది. అతడు నాకు చేసిన అన్యాయం పైనే నా పోరాటం. కానీ షమీ నా భర్త, ఇప్పటికీ అతడంటే నాకు ప్రేమ అని షమీ రిపోర్టర్లతో చెప్పింది.

‘షమీ త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తాను. అతణ్ని కలవాలని ఆతురతగా ఎదురు చూస్తున్నా. కానీ తనకు ఫోన్ చేస్తే బదులివ్వడం లేదు. తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నా, కానీ షమీ మాత్రం నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేద’ని జహాన్ ఆవేదన వ్యక్తం చేసింది. షమీ ఎక్కడున్నాడో అతడి కుటుంబ సభ్యులు కూడా చెప్పడం లేదు. నేను నిస్సహారాయులిని అనిపిస్తోందని హసీన్ చెప్పింది. కాగా షమీకి ఇటీవలే బీసీసీఐ కాంట్రాక్ట్‌ను ఇచ్చిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.